హీరోయిన్‌గా స్టార్ డైరెక్టర్‌ కూతురు..

- Advertisement -

స్టార్ డైరెక్టర్‌ శంకర్‌ చిన్న కుమార్తె అదితీ శంకర్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు. ముత్తయ్య దర్శకత్వంలో కార్తీ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘విరుమన్‌’. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై హీరో సూర్య, జ్యోతిక నిర్మిస్తున్న ఈ చిత్రంలో అదితీ శంకర్‌ హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ విషయాన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించారు.

‘‘అదితీ శంకర్‌కు స్వాగతం. ప్రతి ఒక్కరి హృదయాలను నువ్వు(అదితీ) గెలుచుకుంటావు’’ అన్నారు సూర్య. ‘‘అదితీని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్న సూర్య, కార్తీ, జ్యోతికలకు ధన్యవాదాలు. ఫుల్‌ ప్రిపరేషన్‌తో వస్తున్న అదితీని ఆదరిస్తారనే ఆశిస్తున్నాను’’ అన్నారు శంకర్‌. ‘‘అవకాశం ఇచ్చిన సూర్య, జ్యోతికలకు థ్యాంక్స్‌. వందశాతం కష్టపడి మీరు గర్వపడేలా చేస్తా’’ పేర్కొన్నారు అదితి. 2022లో ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

- Advertisement -

Also Read: 19 మంది తో ఈసారి బిగ్ బాస్ 5 మచ్…!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -