సిద్ధార్థ పశ్చాత్తాపం.. సారీ చెప్పిన హీరో

- Advertisement -

ఇటీవల పంజాబ్ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి కాన్వాయ్ ని ఆందోళనకారులు అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో మోదీ దాదాపు 20 నిమిషాల పాటు రోడ్డు మీదనే ఉండాల్సి వచ్చింది. ఇది తీవ్ర మైన భద్రతా వైఫల్యం అని బాడ్మింటన్ ప్లేయర్, బీజేపీ నేత నైనా నెహ్వాల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై హీరో సిద్ధార్థ స్పందిస్తూ నైనాను .. సబ్టిల్ కాక్ చాంపియన్ ఆఫ్ ది వరల్డ్ అంటూ సంభోదించాడు.

దీనిపై దుమారం రేగింది. నైనా కుటుంబ సభ్యులు, బీజేపీ జాతీయ నాయకులు, పలువురు క్రీడాకారులు సైతం ఈ కాంమెట్ప్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్త చేశారు. దీనిపై ఎట్టకేలకు సిద్ధార్థ స్పందించారు. ఈ వివాదానికి ముగింపు పలకాలని నిర్ణయించారు. నైనాకు క్షమాపణలు చెబుతూ ఒక లేఖను విడుదల చేశారు.

- Advertisement -

‘‘నేను నైనా ట్వీట్ పై చేసిన కామెంట్ కేవలం జోక్ మాత్రమే. నైనా హర్ట్ అయి ఉంటే అయామ్ వెరీ సారీ.. నైనా యు ఆర్ ది బెస్ట్.. నువ్వు నేషనల్ చాంపియన్.’’అంటూ సిద్ధార్థ లేఖలో పేర్కొన్నాడు. తాను చేసిన కాంమెంట్స్ ను చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పాడు. ఎవరినీ హర్ట్ చేయడం తన ఉద్దేశం కాదని సిద్ధార్థ్ పేర్కొన్నాడు.

క్రేజ్ ఉన్నప్పుడే సొమ్ము చేసుకోవాలంటున్న బాలయ్య

కరోనా వచ్చిందా అయితే చావు దరిద్రం పోతుంది.. సెలబ్రిటీ షాక్

టాలీవుడ్ హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -