- Advertisement -

అన్న నిర్మాత అని తెలియ‌ద‌ని చెప్పిన త‌మ్ముడు

- Advertisement -

సీని న‌టుడు ,జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలు మానేసిన ఇండ‌స్ట్రీకి మాత్రం దూరం కాలేదు. నిత్యం ఏదో ఒక సినిమా ఫంక్ష‌న్‌లో క‌నిపిస్తు ఆయ‌న అభిమానుల‌ను అల‌రిస్తున్నాడు.మొన్న‌టికి మొన్న త‌న అన్న కుమారుడు రాంచ‌ర‌ణ్ న‌టించిన రంగ‌స్థ‌లం సినిమా సక్సెస్ మీట్ వ‌చ్చి యూనిట్ మొత్త‌న్ని అభినందించారు.నిన్న‌(గురువారం) రెండు సినిమా ఈవెంట్స్‌కు వ‌చ్చి త‌న మ‌ద్ధ‌తు తెలిపాడు. ర‌వితేజ న‌టించిన నేల టిక్కెట్టు సినిమా ఆడియో ఫంక్ష‌న్‌కు ముఖ్య అతిధిగా వ‌చ్చాడు ప‌వ‌న్‌.దానికి ముందే అల్లు అర్జున్ న‌టించిన నా పేరు సూర్య సినిమా స‌క్సెస్ మీట్‌కు వెళ్లారు ప‌వ‌న్‌.

నా పేరు సూర్య స‌క్సెస్ మీట్‌లో మాట్లాడుతు .. ఈ సినిమాకు త‌న అన్న‌య్య నాగ‌బాబు నిర్మాత అని త‌న‌కు ఇక్క‌డికి వ‌చ్చేవ‌ర‌కు తెలియ‌దని చెప్ప‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌నికి గురి చేసింది.నా పేరు సూర్య సినిమాకు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఒక నిర్మాత అని అందరికి తెలిసిందే.సినిమా ప్ర‌మోష‌న్స్‌లో కూడా నాగ‌బాబు పొల్గోన్నారు.ఈ విష‌యం కూడా ప‌వ‌న్‌కు తెలియ‌దా! అని చాలామంది చ‌ర్చించుకుంటున్నారు.గ‌తంలో నాగ‌బాబు నిర్మాత‌గా రాంచ‌ర‌ణ్ హీరోగా ఆరెంజ్ సినిమా చేశారు. సినిమా ఘోరంగా ప్లాప్ అయింది. ఈ సినిమా ప్లాప్‌తో నాగ‌బాబుకి తీవ్ర న‌ష్టం రావ‌డం,ఆయ‌న అప్పుల్లో కురుకుపోవ‌డం జ‌రిగింది.దీంతో నాగ‌బాబు ఆత్మ‌హ‌త్య చేసుకుందామ‌నే ప్ర‌య‌త్నం కూడా చేశాన‌ని నాగ‌బాబే స్వ‌యంగా తెలిపారు.

ఆ స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ సుమారు 20 కోట్ల స‌హాయం చేశార‌ని నాగ‌బాబు తెలిపారు.మ‌రి అలాంటి అన్న ఆరెంజ్ సినిమా త‌రువాత మ‌రో సినిమా తీస్తుంటే ప‌వ‌న్‌కు తెలియ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం వేస్తుంది. న‌టి శ్రీరెడ్డి ప‌వ‌న్‌,వాళ్ల అమ్మ‌గారిపై అనుచిత వాఖ్య‌లు చేయ‌డం దీని వెనుక వివాస్ప‌ద ద‌ర్శకుడు వ‌ర్మ ఉండటం,ప‌వ‌న్ ప‌లు టీవి ఛానెళ్లుపై ఆరోప‌ణ‌లు చేయ‌డం ఇలా అన్నీ చ‌కా చ‌కా జ‌రిగాయి. దీంతో కొంత‌కాలం ప‌వ‌న్ బహ్య‌ప్రంప‌చానికి దూరంగా ఉన్నాడు.వీటి ఫ‌లితంగా ప‌వ‌న్ గ్రాఫ్ కూడా కొంత‌మేర త‌గ్గింద‌ని కొన్ని స‌ర్వేలు ద్వారా తెలుస్తుంది.మ‌రి ప‌వ‌న్ ఇప్ప‌టి నుండి అయిన జాగ్ర‌త్త వ‌హిస్తాడో లేక జ‌న‌సేన‌ను మ‌రో ప్ర‌జారాజ్యంలా త‌య్యారు చేస్తాడో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -