Sunday, May 5, 2024
- Advertisement -

వాళ్ళ పై విరుచుకు పడ్డ ఇళయరాజా

- Advertisement -

భారత దేశ చలన చిత్ర పరిశ్రమ లో దిగ్గజ సంగీత దర్శకుల్లో ఒకరు ఇళయరాజా. ఈయన మన దక్షిణ చలన చిత్ర పరిశ్రమ లో అరంగేట్రం చేసి దాదాపు గా వెయ్యి కి పైగా సినిమా లకి సంగీతాన్ని అందించిన గొప్ప మహనీయుడు. అయితే ఇళయరాజా కి కోపం ముక్కు మీద ఉంటుంది అని అందరూ అంటారు. తన దగ్గర అనుమతి లేనిదీ తన పాటలని సింగర్స్ ఎవరూ పాడటానికి వీల్లేదు అని ఆయన ఇప్పటికే పలు మార్లు చెప్తూ బాల సుబ్రహ్మణ్యం కి నోటీసులు కూడా అందించారు. దీని పై అప్పట్లో చాలా పెద్ద చర్చ జరిగినప్పటికీ తాజా గా ఆయన ఒక ఇంటర్వ్యూ లో పాల్గొంటూ నేటి తరం సంగీత దర్శకుల పై విరుచుకు పడ్డారు.

తన అనుమతి లేకుండా తన పాటలని ఇష్టానుసారంగా సంగీత దర్శకులు రీమిక్స్ చేసి వాడుతున్నారని, నైపుణ్యం లేని వారు పరిశ్రమ లోకి వస్తే ఇలాగే ఉంటుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే చాలా మంది ఇటీవలే వచ్చిన 96 సినిమా లో ని పాటల గురించే ఆయన మాట్లాడారు అని అందరూ అంటున్నారు. నేటి తరం వాళ్లలో విషయం లేదని, వేరొకరి పాటల మీద ఆధారపడుతున్నారని ఆయన ఘాటుగా స్పందించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -