- Advertisement -

జబర్ధస్త్ సుడిగాలి సుధీర్ ఇంట విషాదం..

- Advertisement -

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. నాలుగు రోజులుగా రోజువారీ కేసులు కాస్త తగ్గినప్పటికీ మరణాలు మాత్రం భారీ నమోదవుతున్నాయి. ప్రతి రోజు 4వేల మందికి పైగా మరణిస్తున్నారు. వృద్ధులే కాదు.. యువకులు కూడా కరోనా కాటుకు బలవుతున్నారు. గత ఏడాది నుంచి కరోనాతో సామాన్య ప్రజలతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం కన్నుమూస్తున్నారు. తాజాగా సుడిగాలి సుధీర్ ఇంట విషాదం నెలకొంది. సుధీర్ అమ్మమ్మ ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఆమె వయసు రీత్యా కోలుకోలేక పోయింది.

ఇటీవలే ఆమె మృతి చెందింది. అమ్మమ్మ మృత దేహంను చివరి చూపుకు సుధీర్ నోచుకోలేక పోయాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ తాజా ప్రోమోలో ఈ విషయాన్ని రామ్‌ ప్రసాద్‌ చెప్పుకొచ్చాడు. ఆదివారం ఈటీవీలో ప్రసారం కావాల్సిన ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ప్రోమో యూట్యూబ్‌లో విడుదలయింది. అందులో ఎప్పటిలాగే కామెడీతో పాటు ఈసారి కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించేందుకు ప్రత్యేకమైన స్కిట్ చేశారు.

అందరూ ఇంట్లోనే ఉండాలని.. మీరు చేసే చిన్న పొరపాటు వల్ల కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని అందులో తెలిపారు. ఇక సుధీర్ అమ్మమ్మ మరణించారని రాంప్రసాద్ ఈ విషయాన్ని చెబుతుంటే ఆయన పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆక్సిజన్ అందక తల్లిని కోల్పోయిన టాలీవుడ్ డైరెక్టర్

నేటి పంచాంగం,మంగళవారం(18-05-2021)

దుర్మార్గులారా.. సోనూసూద్‌ని కూడా వదల్లేదు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -