Friday, May 10, 2024
- Advertisement -

జ‌వాన్ మూవీ రివ్యూ

- Advertisement -

సాయి ధరమ్ తేజ్ మెగామేన‌ల్లుడిగా ఇండ‌స్ట్రికి ప‌రిచియ‌మైన త‌న‌లో టెలెంట్ ఉంద‌ని నిరుపించుకున్న న‌టుడు. ఈ మ‌ధ్య స‌రైన హిట్లు లేక స‌త‌మ‌వుతున్న స‌మ‌యంలో మ‌రోసారి అదృష్టాన్ని పరిక్షీంచుకోవాడానికి జ‌వాన్ తో ప్రేక్షుకుల ముందుకు వ‌చ్చాడు.ఈ సమయంలో తన రెగ్యులర్ స్టైల్ కు భిన్నంగా ఓ మెచ్యూర్డ్ క్యారెక్టర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బీవీయస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మరి జవాన్ గా సాయి ధరమ్ తేజ్ సక్సెస్ సాధించాడా..? బీవీయస్ రవి దర్శకుడిగా విజయాన్ని అందుకున్నాడా..,?

కథ : జై (సాయిధరమ్ తేజ్), కేశవ(ప్రసన్న) బాల్య స్నేహితులు. ఇద్దరివి భిన్న మనస్తత్వాలు. ఒక తప్పు చేయటం మూలంగా తనకు మంచి జరుగుతుందని తెలిసినా.. తప్పు చేయననే తత్వం జైది. ఏం చేసైనా హాయిగా, గొప్పగా జీవించాలనుకునే భావన కేశవది. చిన్నతనం నుంచే తప్పుదారిలో పడిన కేశవ కారణంగా వారి కుటుంబం దూరంగా వెళ్లిపోతుంది. దేశానికి సేవచేయాలన్న ఉద్దేశంతో డీఆర్డీఓలో సైంటిస్ట్ గా ఉద్యోగం చేయాలని కలలు కంటుంటాడు జై. ఎన్నో నేరాలు చేసి మాఫియాతో సంబంధాలు పెట్టుకొని దేశానికే నష్టం చేయాలనుకుంటాడు కేశవ. భారత సైన్యం కోసం డీఆర్డీఓ తయారు చేసిన ఆక్టోపస్ అనే మిసైల్ లాంచర్ ను శత్రువులకు ఇచ్చేందుకు భారీ డీల్ మాట్లాడుకుంటాడు. ఈ డీల్ జరగకుండా జై ఎలా అడ్డుకున్నాడు..? కేశవ ఆట ఎలా కట్టించాడు..? కేశవ భారీ నుంచి తన కుటుంబాన్ని, ఆక్టోపస్ ని జై ఎలా కాపాడాడు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు : సాయి ధరమ్ తేజ్ తన గత చిత్రాలతో పోలిస్తే జవాన్ లో కొత్త లుక్ లో.. కొత్త బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకున్నాడు. తన మార్క్ ఎనర్జీని పక్కన పెట్టి సెటిల్డ్ పర్ఫామెన్స్ తో మెప్పించాడు. ఇతర పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవటంతో సినిమా అంతా తన భుజస్కందాల మీదే నడిపించాడు. దేశాన్ని కాపాడాలా..? తన కుటుంబాన్ని కాపాడుకోవాలా ..? అన్న సంఘర్షణను హావభావాల్లో చాలా బాగా చూపించాడు. విలన్ గా ప్రసన్న సూపర్బ్ అనిపించాడు. స్టైలిష్ విలన్ పాత్రలో ప్రసన్న పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఈ సినిమా తరువాత ప్రసన్న తెలుగులోనూ బిజీ ఆర్టిస్ట్ అయ్యే అవకాశం ఉంది. హీరోయిన్ పాత్ర కేవలం పాటలకే పరిమితమైంది. హీరో తండ్రి పాత్రలో జయప్రకాష్ మరోసారి తన మార్క్ చూపించారు. సినిమా అంతా హీరో, విలన్ ల మధ్య జరిగే మైండ్ గేమ్ కావటంతో ఇతర పాత్రకు పర్ఫామ్ చేసేందుకు పెద్దగా స్కోప్ లేదు.

విశ్లేషణ : ఇద్దరు భిన్న మనస్తత్వాలున్న స్నేహితుల కథను ఎంచుకున్న దర్శకుడు బీవీయస్ రవి.. ఆకట్టుకునే కథా కథనాలతో సినిమాను రూపొదించాడు. ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగినా.. సెకండ్ హాఫ్ ను వేగంగా నడిపించాడు. ముఖ్యంగా హీరో, విలన్ ల మధ్య వచ్చే మైండ్ గేమ్ సీన్స్ థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి. హీరో, విలన్ల మధ్య జరిగి క్యాట్ అండ్ మౌస్ గేమ్ ను చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు. విలన్ పాత్రను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. రచయితగానూ బీవీయస్ రవి సక్సెస్ సాధించాడు. చాలా సందర్భాల్లో డైలాగ్స్ ఆడియన్స్ తో విజిల్స్ వేయిస్తాయి. అయితే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు కథకు స్పీడు బ్రేకర్లలా మారాయి. పాటలు కూడా అదే ఫీల్ కలిగిస్తాయి. తమన్ అందించిన పాటలు పరవాలేదనిపించినా.. నేపథ్య సంగీతం హైలెట్ గా నిలిచింది. నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ట్యాగ్ లైన్ : ఈ జ‌వాన్ ప‌య‌నం ఎంత వ‌రుకో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -