Saturday, April 20, 2024
- Advertisement -

జయమ్ము నిశ్చయమ్మురా  మూవీ రివ్యూ

- Advertisement -
Jayammu Nischayammu Raa Movie Review

ఒక చిన్న సినిమాని నిర్మించి దాన్ని అద్భుతంగా తీర్చి దిద్దడం ఎంత ముఖ్యమో దానికి కావలసినంత ప్రమోషన్ ఇవ్వగలగడం కూడా అంతే ఇంపార్టెంట్. పెళ్లి చూపులు లాంటి స్ట్రాటజీ ఈ మధ్య చాలా నిర్మాతలు అనుసరిస్తున్నారు, మంచి క్రూ తో అప్పో సొప్పో చేసి సినిమా తీసి పెద్ద ప్రొడ్యూసర్ కి సినిమాని అమ్మేయ్యడం లేదా వారి సపోర్ట్ తో ఒక డీసెంట్ రేటు లో గట్టిగా ప్రచారం చేసుకోవడం.

జయమ్ము నిశ్చయమ్మురా అంటూ శ్రీనివాసరెడ్డి హీరోగా వచ్చిన సినిమా కి మొదటి నుంచీ బాగానే హైప్ ఉంది. ఈ సినిమా కంటే ముందర శ్రీనివాస రెడ్డి రెండు మూడేళ్ళ క్రితం గీతాంజలి లో హీరోగా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. మరి ఇన్నేళ్ళ నిరీక్షణ శ్రీనివాస రెడ్డి కి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో చూద్దాం రండి. 

కరీం నగర్ కి చెందిన సర్వ మంగళం ( శ్రీనివాస రెడ్డి) స్వామీజీ (జీవా) కి పరమ భక్తుడు. అన్ని విషయాలూ అతన్ని అడిగే చేస్తూ ఉంటాడు . అతి చిన్న విషయం దగ్గర నుంచీ స్వామీజీ పర్మిషన్ లేకుండా ఒక్కటి కూడా చెయ్యదు. కాకినాడ లో అతనికి స్వామీజీ సలహా మేరకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. కానీ అతని తల్లి ఆరోగ్యం కారణంగా ఆ ఉద్యోగానికి వెళ్ళాలా ఒద్దా అనే మీమాంస లో ఉన్న సమయం లో తన తల్లి అక్కడికి వెళ్ళమని త్వరగా ట్రాన్స్ఫర్ మీద తన దగ్గరకి వచేయ్యమని పంపుతుంది. కాకినాడ లో రాణీ (పూర్ణ ) ని చూసి తోలి చూపులోనే ఇష్టపడతాడు సర్వమంగళం ఆ తరవాత రాను రానూ అతని ప్రేమ ఎటు వైపు తిరిగింది. అతనిట్రాన్స్ఫర్ కి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి అనేది కథ మొత్తం. ఈ సినిమాకి ముఖ్య పాజిటివ్ పాయింట్ శ్రీనివాస రెడ్డి అనే చెప్పాలి. అతని నటన తో అమాయకత్వం తో థియేటర్ లో అందరినీ ఖచ్చితంగా ఆకట్టుకుంటాడు. కామెడీ కూడా చాలా చోట్ల పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. పాటల్లో కానీ ముఖ్య సన్నివేశాల్లో కానీ సినిమాటో గ్రఫీ అదిరిపోయిందని. హీరోయిన్ పూర్ణ కూడా తనదైన శైలి లో చాలా బాగా చేసింది. ఇద్దరూ వారి వారి రోల్స్ లో చక్కగా సరిపోయారు. పాటల చిత్రీకరణ , ఎడిటింగ్ బాగున్నాయి. 

నెగెటివ్ లు : సినిమా ఆసాంతం నెమ్మదిగా నడుస్తున్న ఫీల్ కలుగుతుంది. పాత సినిమాల్ క్రమం లో మరీ చాదస్తపు సీన్ లు , హీరో చాదస్తం విసిగిస్తాయి. కమర్షియల్ గా ఒక్క హంగు కూడా లేకపోవడం ఇబ్బందికర విషయం. డైరెక్టర్ స్క్రీన్ ప్లే ని ఇంకాస్త ముందరకి తీసుకుని వెళ్లి మరికొన్ని ఇంటరెస్టింగ్ సీన్ లు గనక రాసుకుని ఉంటే అద్భుతంగా కథ నడిచి ఉండేది. కామెడీ కొన్ని చోట్ల సూపర్ అనిపించినా కొన్ని చోట్ల చాలా ఫోర్స్ గా ఉంది. పాటల నిడివి కూడా కాస్త ఎక్కువగా ఉంది. పాయింట్ తేల్చకుండా చాలా చోట్ల నాన్చుడు ధోరణి చూపించాడు డైరెక్టర్. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది. 

మొత్తంగా : మొత్తంగా చూస్తే జయమ్ము నిశ్చయమ్మురా చిత్రం ఫామిలీ తో కలిసి ఒక్కసారి ఈజీగా చూసేయచ్చు. శ్రీనివాస రెడ్డి ఆసాంతం ఆకట్టుకుంటాడు. ఒక పరిణితి చెందిన నటుడిగా ఎలాంటి పాత్రనైనా చెయ్యగలను అని అతను మళ్ళీ నిరూపించుకున్నాడు. స్లో గా సాగే స్క్రీన్ ప్లే ని పక్కన పెడితే సినిమాలోని క్యారెక్టర్ లు మనతో కచ్చితంగా కానట్ అవుతాయి, కామెడీ కూడా బాగానే ఉంది. ఈ వారంతం లో ఫామిలీ తో కలిసి థియేటర్ లలో ఎంజాయ్ చెయ్యదగ్గ సినిమానే .. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -