టెంపర్..యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. 2015లో వచ్చిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్‌లోని కొత్త నటుడిని బయటికి తీశాడు పూరి జగన్నాథ్. ఈ కథపై అన్ని భాషలు వారు కన్నేసి రీమేక్‌లు చేస్తున్నారు. తమిళంలో హీరో విశాల్ ఈ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. బాలీవుడ్‌లో ఈ సినిమాను రీమేక్ చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఈ సినిమాలో నటించాడు
సింబా పేరుతో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. ఇక ఓపెనింగ్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే 22 కోట్ల రూపాయలు వసూలు చేసిందని సమాచారం. ఈ సినిమాతో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా ఆలీఖాన్ హీరోయిన్‌గా పరిచియం అయింది. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినప్పటికి రణవీర్ – సారా జోడీ మెప్పించిదని టాక్.
- రావణుడిగా సీఎం విజయ్.. అమ్మవారిగా త్రిష..!
- సినీ నటుడు బాలకృష్ణకు గాయం..
- ‘టాక్సిక్’ నుంచి ‘మనసాగదే..’ సాంగ్ రిలీజ్!
- సరికొత్త వార్ యాక్షన్ డ్రామా ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’!
- ది ఒడిస్సీ.. తొలి వీకెండే రూ.2,548 కోట్ల వసూళ్లు!
- కొత్త తరహా థ్రిల్లర్ ‘న్యూటన్స్ థర్డ్ లా’!
