రా ఏజెంట్ గా కాజల్ అగర్వాల్..

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీకి సీతా కళ్యాణం చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించింది. గత ఏడాది వివాహం చేసుకున్న తర్వాత మళ్లీ ఈ బ్యూటీ సినిమాల్లో నటిస్తుంది. ఇటీవల రిలీజ్ అయిన మోసగాళ్ళు చిత్రం మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా కాజల్ అగర్వాల్ లేడీ రా ఏజెంట్ గా నటించబోతుంది.

ఈ మద్య అఖిల్ అక్కినేని త్వరలో ఏజెంట్ గా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో కాజల్ నటించడం లేదు. త్వరలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో కాజల్ అగర్వాల్ రా ఏజెంట్ పాత్రలో కనిపించబోతుందట.

- Advertisement -

దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడే యువతిగా కనిపోయించనుందట. ఎప్పుడూ గ్లామర్ పాత్రలో కనిపించే ఈ బ్యూటీ రా ఏజెంట్ గా ఎలా కనిపించబోతుందా అని ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు.

నటి రష్మికకు గుండు.. అసలు కథ ఏంటీ?

బాలయ్యతో కామెడీ డైరెక్టర్ కల నెరవేరబోతుందా?

క్వీన్​ కంగనాకు కోపం వచ్చింది.. ఎందుకో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -