Friday, March 29, 2024
- Advertisement -

కల్యాణ్ రామ్ ‘నా నువ్వే’ రివ్యూ

- Advertisement -

నందమూరి కల్యాణ్ రామ్ గ‌త కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బందిప‌డుతున్నాడు.ప‌టాస్ సినిమా తరువాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో హిట్ లేదు క‌ల్యాణ్ రామ్‌కు.అయితే క‌ల్యాణ్ రామ్ ఇప్ప‌టి వ‌ర‌కు మాస్ సినిమాలే చేశాడు .త‌న ఇమేజ్‌ను ప‌క్క‌న పెట్టిమ‌రి నా నువ్వే లాంటి ల‌వ్ స్టోరి చేశాడు కల్యాణ్ రామ్‌. ‘నా నువ్వే’ చిత్రంలో లవర్ బాయ్ అవతారంలో కనిపించడానికి రెడీ అయ్యాడు. అతడికి జోడీగా తమన్నా కనిపించడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది.మ‌రి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం!

కథ:వరుణ్(కళ్యాణ్ రామ్) చదువు పూర్తి చేసుకొని అమెరికాలో ఉద్యోగం కోసం బయలుదేరతాడు. కానీ మొదటిసారి ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ మిస్ చేస్తాడు. రెండోసారి ఎయిర్ పోర్ట్ కు బయలుదేరే సమయంలో వరుణ్ కి సంబంధించిన ‘లవ్ సైన్స్’ అనే పుస్తకం అనుకోకుండా మీరా(తమన్నా) అనే అమ్మాయికి దొరుకుతుంది. ఆ బుక్ ఎక్కడ వదిలేసినా.. తిరిగి మీరా దగ్గరకే చేరుకోవడంతో ఆమె డెస్టినీ అని భావిస్తుంది. ఆ బుక్ లో ఉన్న వరుణ్ ఫోటోను చూసి ఇష్టపడుతుంది. వరుణ్ ఫోటో తన లైఫ్ లోకి రాగానే అన్నీ పాజిటివ్ గా జరుగుతుండడంతో అతడు తనకి లక్కీ అనుకుంటుంది. దీంతో అతడిని వెతికే ప్రయత్నం చేస్తుంటుంది. వరుణ్ సెకండ్ టైమ్ కూడా ఫ్లైట్ మిస్ చేసుకుంటాడు. దీంతో కొన్నిరోజులు హైదరాబాద్ లోనే ఉండాలనుకుంటాడు. వరుణ్.. మీరాకు కనిపించినట్లే కనిపించి దొరక్కుండా వెళ్ళిపోతుంటాడు. ఎలాగోలా వరుణ్ ని చేరుకుంటుంది. తన కథ మొత్తం అతడికి చెబుతుంది. డెస్టినీని పెద్దగా నమ్మని వరుణ్.. మీరా ప్రేమకు ఓ పరీక్ష పెడతాడు. మరి ఆ పరీక్షలో మీరా గెలిచిందా..? తను ఎంతగానో ప్రేమించే వరుణ్ ని కలవడం కోసం ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది..? చివరకు ఈ జంట ఒక్కటయ్యారా..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ: ప్రేమించే వ్యక్తితో డెస్టినీనే తనను కలుపుతుందని నమ్మకంతో ఉండే అమ్మాయి, డెస్టినీ అనేది మూఢనమ్మకమని భావించే అబ్బాయి.. ఈ ఇద్దరు ఎలా ప్రేమించుకున్నారు..? విడిపోయి మళ్లీ ఎలా కలుసుకున్నారు..? అనే అంశాలతో కథను రాసుకున్నాడు. ఒక పుస్తకం కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకోవడం అనే పాయింట్ చాలా కొత్తగా ఉంది. హీరోయిన్ డెస్టినీను నమ్ముతుంది కాబట్టి తనకు ఎదురయ్యే సంఘటన కారణంగా హీరోని ప్రేమిస్తుంది. ఆమె ప్రేమించడానికి బలమైన కారణాలు కనిపించకపోయినా.. ప్రేమకు లాజిక్స్ ఉండవని సరిపెట్టుకోవచ్చు. కానీ హీరోకి అప్పటివరకు డెస్టినీ మీద నమ్మకం లేనట్లు చూపించి దాని కారణంగానే హీరోయిన్ పై ప్రేమ పుట్టినట్లు చూపిస్తారు. దీంతో అక్కడ హీరో క్యారెక్టరైజేషన్ దెబ్బతింది.

ఇద్దరూ ప్రేమించుకోవడం మొదలుపెట్టిన తరువాత మళ్లీ హీరో క్యారెక్టరైజేషన్ సాధారణ స్థితికి వచ్చేస్తుంది. తెరపై ఈ జంట రొమాన్స్, కెమిస్ట్రీ ఆడియన్స్ కు పెద్దగా నచ్చకపోవచ్చు. తమన్నా తన పెర్ఫార్మన్స్ తో తెరను మొత్తం ఆక్యుపై చేస్తుంటే.. కళ్యాణ్ రామ్ మాత్రం ఆమె స్పీడ్ ను అందుకోలేకపోయాడు. ఒక అమ్మాయి తను ప్రేమించే వ్యక్తిని చేరుకోవడం కోసం పడే ఆత్రం, ఎమోషన్ తన కళ్లతోనే పలికించింది తమన్నా. ఇద్దరూ గొడవపడి దూరమయ్యే సందర్భంలో ఆమె పడే వేదన, తిరిగి కలుస్తామా..? లేదా..? అనే సందేహాలు కలిగే సమయంలో తమన్నా అధ్బుత నటన కనబరిచింది. ఇప్పటివరకు తమన్నాకు ఏ సినిమాలో కూడా ఈ స్థాయిలో నటన పండించే అవకాశం రాలేదనే చెప్పాలి. దీంతో ఈ సినిమాలో తన పెర్ఫార్మన్స్ తో చేలరేగిపోయింది. స్క్రీన్ మొత్తం తనే కనిపిస్తుంటుంది. కళ్యాణ్ రామ్ తో తమన్నా అనేది మిస్ మ్యాచ్. ఇదే కళ్యాణ్ రామ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసినప్పటికీ ఈ కథలో మరో హీరో ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది.

బోట‌మ్ లైన్: ఈ క‌థ‌కి మ‌రో హీరో అయితే బాగుండేది!

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -