స్పై ‘ఏజెంట్ వినోద్’గా కళ్యాణ్ రామ్ !

- Advertisement -

ప‌టాస్ సినిమాతో త‌న‌లోని కామెడీ జోన‌ర్ ను ప‌రిచ‌యం చేసి విజ‌యం సాధించిన హీరో నందమూరి కళ్యాణ్ రామ్. ఈ నంద‌మూరి న‌టుడు ఇప్ప‌డు మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు.ఈ కొత్త సినిమాకు సంబంధించిన‌ పూజా కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాకు రాజేంద్ర అనే కొత్త ద‌ర్శ‌కుడు తీస్తున్నాడు.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ అయిన‌ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో‌ ఈ సినిమాను వ‌స్తుంది. కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న 19వ సినిమా ఇది.దీన్ని ప్రొడకన్ నెం.14 గా తెరకెక్కిస్తున్నారు. దీన్ని నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ లు నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు బుచ్చిబాబు క్లాప్ కొట్టి స్టార్ట్ చేశాడు. ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ, రాధాకృష్ణ కెమెరాను స్విచ్ఛాన్ చేశారు.

- Advertisement -

మార్చి రెండో వారం నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ కానుంద‌ని చిత్ర యూనిట్ చెబుతోంది. హీరోయిన్ తో స‌హా.. ఇత‌ర న‌టీన‌టుల‌ను, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను కొద్దిరోజుల్లోనే చెబుతామ‌ని సినిమా యూనిట్ చెబుతోంది. ఈ సినిమాతో మంచి విజ‌యం సాధిస్తామ‌ని డైరెక్ట‌ర్ రాజేంద్ర చెబుతున్నాడు. సినిమా పేరును కూడా త్వ‌ర‌లో చెబుతామ‌ని పేర్కొన్నాడు.

రొమాన్స్ పండించ‌బోతున్న స‌త్య‌దేవ్, త‌మ‌న్నా

ఊర‌మాస్‌.. రామ్ కొత్త సినిమా మాములుగా ఉండ‌దు… లింగుస్వామితో.. !

మోనాల్, అఖిల్ ఆన్‌స్క్రీన్ రొమాన్స్ మొద‌లైంది !

రాజ‌కీయాల్లోకి రంగ‌మ్మ‌త్త అన‌సూయ‌.. ఏ పార్టీయో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -