Saturday, May 4, 2024
- Advertisement -

ప్రభుత్వమా..లేక ఈస్ట్‌ ఇండియా కంపెనీనాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన క‌మ‌ల్ హాస‌న్

- Advertisement -
Kamal Haasan Says GST Rate Will Ruin Cinema

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఒకే దేశం.. ఒకే పన్ను పేరిట భారీ ప్రచారంతో.. కోటి ఆశలతో మరో నెల వ్యవధిలో జీఎస్టీ పన్నును జూలై ఒక‌టి అమలు చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా జీఎస్టీకి సంబంధించి ఇప్పటికే పలువురు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.అయితే ఇప్పుడు జీఎస్‌టీపై విశ్వ‌న‌టుడు క‌మ‌ళ్‌హాస‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

చిత్ర పరిశ్రమపై 28శాతం జీఎస్టీ పన్ను విధించడంపై ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమాలపై జీఎస్టీ పన్ను తగ్గించకపోతే తాను చిత్రపరిశ్రమ నుంచి తప్పుకోవాల్సి వస్తుందని అన్నారు.‘జీఎస్టీ విధానాన్ని మేం స్వాగతిస్తాం. కానీ ప్రాంతీయ చిత్రాలకు, అంతర్జాతీయ చిత్రాలకు ఒకే విధమైన పన్ను విధించడం సరికాదు. ప్రాంతీయ, చిన్న సినిమాలే దేశీయ సినిమాకు బలం. అలాంటప్పుడు అధిక పన్నులు విధిస్తే.. పరిశ్రమ నష్టపోతుంది. ఈ విధానాన్ని నేను ఒప్పుకోను. జీఎస్టీ రేటును 12 లేదా 15 శాతానికి తగ్గించాల‌ని డిమాండ్ చేశారు.చిన్న సినిమాలపై భారీగా పన్నులు విధించడం ఏంటనీ.. ఇదేమైనా ఈస్ట్‌ఇండియా కంపెనీనా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

{loadmodule mod_custom,GA1}

రీజినల్ సినిమాలో జాతీయ, అంతర్జాతీయ సినిమాలతో పోల్చి చూడకూడదన్న కమల్.. నిత్యావసరాల మాదిరి పన్ను విదానం సినిమా రంగంపై విదించటం సరికాదన్నారు. పెద్ద నోట్ల రద్దుతో సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులకు గురైందని ఇప్పుడు జీఎస్టీ 28 శాతం అమల్లోకి వస్తే మరిన్ని నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
సినీరంగంపై జీఎస్టీ పన్నుని తగ్గించాలని కొంతకాలంగా దక్షిణాది సినీ పరిశ్రమలు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి (ఫిలిం ఛాంబర్‌) శుక్రవారం చెన్నైలో అత్యవసర సమావేశం ఏర్పాటుచేసింది.ఈ 28% జీఎస్టీ విధిస్తే సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని, దీనిని 12 లేదా 18కి తగ్గించాలని ఛాంబర్‌ అధ్యక్షుడు సురేష్‌ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్‌ 15వ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కమల్‌ విజ్ఞప్తిని ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.ప్ర‌స్తుతం టాలీవుడ్ లో పెద్ద సినిమాల‌కు 15శాతం, చిన్న సినిమాకు 7 శాతం, డ‌బ్బింగ్ మూవీల‌కు 20 శాతం ప‌న్ను ఉంది.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

{youtube}HNPOWfW8D6o{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -