అఫీషియల్: చరణ్ -శంకర్ మూవీలో హీరోయిన్ గా కియారా కన్ఫర్మ్..!

- Advertisement -

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు దీనికి నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. కాస్టింగ్ సెట్ చేస్తున్నారు. ఇందుకోసం శంకర్ హైదరాబాద్ లోనే ఉంటూ పనులు పూర్తిచేస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ను ఎంపిక చేశారు.

కాగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరు అనే విషయమై చాలా రోజుల పాటు మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. చరణ్ కు జోడీగా రష్మిక మందన్న ను ఎంపిక చేశారని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ రూమర్స్ కి చెక్ పెట్టారు మేకర్స్. కియారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా ఆమెతో దర్శకుడు శంకర్ చర్చలు జరుపుతున్న ఓ పోస్టర్ ని స్వయంగా దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా విడుదల చేశారు.

- Advertisement -

ఈ పోస్టర్ లో కియారాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. వెల్ కమ్ ఆన్ బోర్డ్ కియారా అద్వానీ అని మెన్షన్ చేశారు. అలాగే ఆ పోస్టర్ లో ఆర్సీ 15, ఎస్వీ 50 అని మెన్షన్ చేశారు. దీనిని బట్టి శంకర్- చరణ్ ప్రాజెక్టులో కియారా హీరోయిన్ అని చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం కియారా పలు హిందీ సినిమాల్లో నటిస్తోంది. చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్, చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఫైనల్ షెడ్యూల్ నడుస్తున్నాయి. ఇవి కంప్లీట్ కాగానే శంకర్ -చరణ్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Also Read

మెగాస్టార్ తో సంపత్ నంది మూవీ.. నిజమేనా..!

కవల పిల్లలు కన్న సెలెబ్రిటీలు ఎవరో చూడండి..!

పవన్, మహేష్ మధ్యలో ప్రభాస్.. రంజుగా పొంగల్ పోటీ..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -