Wednesday, April 24, 2024
- Advertisement -

టీడీపీ నేతల వ్యాఖ్యలపై టాలీవుడ్‌ ఫైర్‌

- Advertisement -

సినిమా ఇండస్ట్రీ గురించి ఓ విలేఖరి చెసిన దూషణ పై నిరసన ను సినిమా పరిశ్రమ చెపట్టింది. ఎఫ్.ఎన్.సి.సి లో జరిగిన ఈ కార్యక్రమంలొ మా అసోసియెషన్ అధ్యక్షుడు శివాజీరాజా, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్, చాంబర్ అధ్యక్షుడు కిరణ్, తమ్మారెడ్డి భరద్వాజ, కొమర వెంకటేష్, పరుచూరి గోపాలకృష్ణ, మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్ తదితరులు పాల్గొన్నారు.

శివాజీరాజా: సినిమా ఇండస్ట్రీ మీద టీవి.5 విలేఖరి సాంశివరావు, టిడిపి ఎంఎల్.సి రాజేంద్రప్రసాద్ నీచమైన కామెంట్ లు చెయటం దారుణం. వారు అర్హత కు తగ్గట్టు బిహేవ్ చెయాలి. క్షమాపణలు చెప్పి పదవుల నుంచి తప్పుకొవాలన్నారు.

హరీష్ శంకర్ : ఇది మీడియా మీద యుద్దం కాదు. మీడియా వల్లే మేము గొప్పవాళ్లమయ్యాము. ఇలాంటి ఇష్యూస్ మళ్లీ మళ్లీ జరగకూడదన్నారు. బాధ్యతాయుతమైన పదవిలొ ఉన్న ఓ ఇండివిడ్యువల్ పర్సన్ చెసిన ఈ తప్పు క్ఞమించరాని నేరమన్నారు. టీవి.5 యాజమాన్యం సాంబశివరావు పై చర్యలు తీసుకొవాలన్నారు.

సుప్రియ: సినిమా పరిశ్రమ మీద, ఆడవాళ్ల మీద నీచంగా మాట్లాడిన సాంబశివరావు మీద చర్యలు తీసుకొవాలన్నారు.

తమ్మారెడ్డి: మీడియా అంటే ఇండస్ట్రీ లొ‌భాగమే. అయితే మనలొ మనం ఇలా తిట్టుకొవటం బాధ కల్గించింది. టీవి.5 సాంబశివరావు మీద కఠినంగా చర్యలు తీసుకొవాలి. నటుల్లో కొందరు తప్పుగా మాట్లాడిన మీరు ఖండించండి.సభ్యత లేకుండా మాట్లాడె వాళ్లను మీడియా ఎంకరేజ్ చెయ్యెద్దని‌ మనవి అన్నారు.

నందినిరెడ్డి: మా కుటుంబంలొ సినిమా పరిశ్రమకు వచ్చిన తొలి వ్యక్తిని నేను. నాకు పరిశ్రమే కుటుంబం. అలాంటి సినిమా పరిశ్రమ గురించి టీవి.5 విలేఖరి ప్రైమ్ టైమ్ లొ తప్పుగా మాట్లాడటం బాధ కల్గించింది. జనాల్లొకి అనవసరంగా మురికిని పట్టిస్తున్నారు. దయచేసి వ్యక్తిగతంగా ఎవరికి వారే బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

ఎన్.శంకర్: బాధకరమైన సంఘటన గురించి మాట్లాడాల్సి వచ్చింది. అప్పుడప్పుడు తప్పులు జరుగుతుంటాయి. కానీ ఓ విలేఖరి సినిమా పరిశ్రమ గురించి తప్పుగా మాట్లాడటం వల్ల సినిమా వారి కుటుంబాలు చాలా బాధ పడ్డాయి. చానెల్స్ వాళ్లు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి,చెడు వార్తలను టాపిక్ లను నియంత్రించాలని కొరారు.

అలీ: సినిమా పరిశ్రమ , మీడియా ఓ కుటుంబం లాంటివి. మన మధ్య విషయాలు గుట్టుగా ఉండాలి కానీ, రొడ్డున పడకూడదు. పక్క రాష్ట్రాలు తమిళనాడు ,కర్ణాటకలొ సినిమా పరిశ్రమ గురించి ఎవరు తప్పుగా మాట్లాడరు. మన వద్ద దాసరి గారి లేని లోటు కన్పిస్తొంది. ఇది మన సమస్య మనమే తెల్చుకొవాలన్నారు.

కిరణ్: సినిమా మీద ఆధారపడి చానెల్స్ కంటెంట్ నడుపుతున్నాయి. కొన్ని చానెల్స్ శ్రీదేవి మరణం మీద బాగా ఓవర్ చేసాయి. జనాలు తిడుతున్నారు. అది తప్పు. అలాంటి ప్రొగ్రామ్ లు కరెక్ట్ కాదు. సాంబశివరావు లాంటి వాళ్లు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

ఎస్.వి.కృష్ణారెడ్డి: మీడియా అంటే ఇండస్ట్రీలొ భాగమే. మాకు సెన్సార్ ఉంది.సంస్కారం ఉంది. మరి మీడియాకు..?. కుటుంబ సభ్యులందరు టీవిలు చూస్తుంటారు. బూతులను వదలి, పనికొచ్చె పనులు చెయ్యలన్నారు.

స్వప్న దత్: ప్రతి దానికి మీడియాకు సినిమా వారు కావాలి. బట్ సినిమా వారి గురించి బ్యాడ్ గా మాట్లాడటం బాలేదు.

బి.వి.ఎస్.రవి: మీడియా అనేది వారధి. అది తప్పుడు విషయాలను ప్రమోట్ చెయటం కరెక్ట్ కాదు. ఇండస్ట్రీ గురించి ,వ్యక్తుల గురించి తన రేటింగ్ కొసం దిగజారుడు మాటలు మాట్లాడాడు. మంచి చెడు అన్నీ చొట్లా ఉందన్నారు.

రకుల్: రేటింగ్ ,వ్యూస్ కొసం గాసిప్స్ క్రియెట్ చెయటం చూశాం. బట్ ఓ టీవి లైవ్ డిబేట్ లో తప్పుడు మాట్లాడటం బాధాకరం. సినీ పరిశ్రమలో వర్క్ చెసె మా లాంటి వారి కుటుంబాలు ఇలాంటి కూతల వల్ల చాలా బాధ పడతారన్నారు . మీడియాలొ మార్పు రావాలన్నారు.

మంచు లక్ష్మీ: సినిమా పరిశ్రమలొనె పుట్టి ,సంపాదించి, ఇక్కటే ఖర్చు పెడుతున్నాము. బట్ మా గురించి తప్పుగా ప్రమోట్ చెసె వార్తలు చూసి అలసిపొయాము. సెన్సెషన్ కొసం చాలా తప్పుడు వార్తలు ప్రమోట్ చెస్తున్నాయి. మా వల్ల మంచితో పాటు తప్పుగా రాసి చాలామంది బ్రతుకుతున్నారు. దాసరి గారి లాంటి వారు ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. మీడియా నే దీన్ని ఖండించాలి.సొసైటీ కొసం మా సినిమా వాళ్లే ముందుంటాము. మేము మనుషులమే. మా పై తప్పుడు ప్రచారాలు ఆపాలన్నారు.

పరుచూరి గొపాలకృష్ణ: సినిమా వారు ప్రపంచాన్ని మార్చెస్తారని ఎంతొమంది నిరూపించారు. సినిమా వల్ల సొసైటీ కి ఎంతొ మంచి జరిగింది. తారకరామారావు గారు, నాగెశ్వరరావు, కృష్ణ గారి లాంటి మహనీయుల అడుగుజాడల్లొ బ్రతుకుతున్నాము. మా లాంటి వారి గురించి తప్పుడు మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. సోసైటీలొ మంచితనం పెరగాలి. సినిమాకు సెన్సార్ ఉంటుంది. కానీ టీవి లొ వచ్చె డిబేట్ లకు సెన్సార్ లేదు. దయచేసి చెడును కట్ చెయండన్నారు.

సి.కల్యాణ్: మా మీద తప్పుడు ప్రచారాలు మానాలి. మాలోనె కాంట్రవర్సీ లను క్రియెట్ చెయటం కరెక్ట్ కాదు. వెబ్ మీడియాల్లొ మరీ దారుణంగా వార్తలు మా సినిమా వారి గురించి రాస్తున్నారు. మన ఇండస్ట్రీ గురించి తప్పుగా మాట్లాడితే సినిమా మీడియా వారే ఖండించాలన్నారు.

శ్రీకాంత్: ఫేక్ న్యూస్ లను మీ డబ్బుల కొసం రాయకండి . మా భార్య సినీ పరిశ్రమ వ్యక్తి . మా కుటుంబ సభ్యులు బాధ పడే లా ఎవరు వ్యవహరించవద్దన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -