‘సర్కారు వారి పాట’లో మహేష్ ఏం చేస్తాడంటే ?

- Advertisement -

మహేష్ బాబు 27వ చిత్రం ఎప్పుడు ప్రకటిస్తారు అని ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్న క్రమంలో ఇటీవలే సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా మహేష్ బాబు 27వ చిత్రంను ప్రకటించారు. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు తన 27వ చిత్రం చేయబోతున్నారు. ఈ సినిమాకి సర్కారు వారి పాట అనే టైటిల్ ను పెట్టారు.

టైటిల్ తో పాటు మహేష్ బాబు ప్రీ లుక్ ను కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమా కథ గురించి సినీ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో రకరకాలుగా ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. తాజాగా సినీ వర్గాల్లో ఈ చిత్రం కథ గురించి ఆసక్తికర విషయాలు ప్రచారం జరుగుతున్నాయి. కథలోకి వెళ్తే.. మహేష్ గోవాలా ఉంటూ అత్యవసరం ఉన్నవారికి ఎక్కువ వడ్డీకి డబ్బు ఇస్తూ ఉంటాడు. డబ్బులు వసూళ్లు చేయడం.. డబ్బులు ఇచ్చే వంటి సీన్స్ చాలా ఎంటర్ టైన్ మెంట్ గా తెరక్కించబోతున్నారని టాక్.

- Advertisement -

కథ మెయిన్ స్ట్రీమ్ ఏంటంటే బ్యాంకులను వందల కోట్లు ముంచి విదేశాలకు పారిపోయిన బడా వ్యాపారస్తుల నుండి డబ్బు రాబట్టడం అన్నట్లు తెలుస్తోంది. సరిలేరు నీకెవ్వరు తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సినిమాని హిందీ.. తమిళం.. మలయాళం.. కన్నడం భాషల్లో రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో మహేష్ కి జోడిగా కియారా అద్వానీని ఎంపిక చేశారు. ప్రస్తుతం షూటింగ్స్ జరిగే పరిస్థితి లేదు కనుక మరో రెండు మూడు నెలలు తర్వాత షూటింగ్ మొదలు పెట్టనున్నారు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -