Monday, May 13, 2024
- Advertisement -

మజ్ను రివ్యూ

- Advertisement -

వరస అట్టర్ ప్లాప్ సినిమాల తరవాత తెలుగు సినిమాకి ఊహించని సూపర్ హిట్ లు ఇస్తున్న స్టార్ హీరో నాని. స్టార్ హీరో అని ఎందుకు అనాల్స్ ఒచ్చింది అంటే వరసగా హిట్ సినిమాలు ఎవడే సుబ్రహ్మణ్యం , భలే భలే మగాడి వోయ్ , కృష్ణ గాడి వీర ప్రేమ గాథ , జెంటిల్మెన్ అంటూ నాలుగు హిట్ లు ఇచ్చిన నాని.

ఇప్పుడు ఉయ్యాలా జంపాల ఫేం విరించి వర్మ తో ఐదవ హిట్ కోసం పరితపిస్తున్నాడు. ఉయ్యాలా జంపాల సినిమాని లైటర్ వెర్షన్ లో తీసుకువెళ్ళిన వర్మ ఈ సినిమాని ఏరకంగా సాగించాడో చూద్దాం రండి.

రాజమౌళి రాకతో సినిమా మొదలు అవుతుంది, బాహుబలి సినిమా డైరెక్ట్ చేస్తున్న రాజమౌళి ఆయన కి అసిస్టెంట్ గా చేసిన నాని ఇద్దరూ ఓపెనింగ్ విపరీతంగా నవ్విస్తారు. మన హీరో పేరు ఆదిత్య ( నాని) తనకి ఇష్టమైన సుమ ( ప్రియ శ్రీ) అనే అమ్మాయిని ఫ్లిర్ట్ చేస్తూ చేస్తూ తన ఫ్లాష్ బ్యాక్ ని చెప్పడం మొదలు పెడతాడు. తన గతం లో ఉన్న అమ్మాయి నీ ( అనూ ఇమ్మా ) , తన ప్రేమ కథ -( భీమవరం లో జరుగుతుంది ) నీ హీరోయిన్ కి చెప్పడం మొదలు పెడతాడు. సినిమా అలా అలా మంచి పాటల నడుమ ఇంటర్వెల్ బ్యాంగ్ కి చేరుకుంటుంది. ఒక డీసెంట్ – ఆసక్తికర ట్విస్ట్ తో ఇంటర్వెల్ తెరమీద పడుతుంది. సెకండ్ హాఫ్ లో వీరి ప్రేమ కథ ట్రయాంగిల్ ప్రేమ కథగా మారుతుంది. చివరికి ఆదిత్య ఎవరికి సొంతం అయ్యాడు అనేది తెరమీడనే చూడాలి మరి. సినిమాకి  ముఖ్యమైన అసెట్ గా నానీ నిలిచాడు అని చెప్పచ్చు. నానీ తన నటన తోనే కాక రోమాన్స్ తో కూడా ఇరగదీసాడు. ఎంచుకున్న కథ ఏదైనా , డైరెక్టర్ ఎలాంటివాడు అయినా పాత్రలో నవ్వులు పూయిస్తూనే అద్భుతంగా నటించగల హీరోగా ఎదుగుతున్నాడు హీరో నాని. డైరెక్టర్ వర్మ ప్రేమ కథని చాలా చక్కగా చూపించాడు. ఫన్ మీద పూర్తిగా దృష్టి పెట్టిన వర్మ సింపుల్ గా నాచురల్ గా సినిమాని లాగేసాడు. వెన్నెల కిషోర్ సీన్ లు కూడా బాగున్నాయి. ఆఖరి 15 నిమిషాలు హిలేరియస్ గా ఉంటుంది . రాజమౌళి ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. ప్రభాస్ పెళ్లి గురించి, బాహుబలి సినిమా గురించీ సెటైర్ లు సూపర్ ఉన్నాయి. 

నెగెటివ్ లు .

ఈ సినిమా లో నెగెటివ్ లు పెద్దగా లేవు కానీ కథ ముందే ఊహించేసే విధంగా ఉండడం నెగెటివ్ అని చెప్పచ్చు. సెకండ్ హాఫ్ మొదటి హాఫ్ తో కంపేర్ చేస్తే కాస్త స్లో గానే అనిపిస్తుంది. కామెడీ మీద ప్రధానం గా దృష్టి పెట్టిన డైరెక్టర్ వర్మ సినిమాలో హీరోయిన్ హీరో ల మధ్యన కెమిస్ట్రీ విషయం లో కాస్త తడబడ్డాడు అనిపిస్తుంది. మ్యూజిక్ చాలా బాగున్నా కూడా తెరమీద ఇంకా బాగా తీయచ్చు. లైటర్ వెర్షన్ లో వెళ్ళిపోవడం తో సినిమాలో కిక్ మిస్ అవుతుంది. ఏ సెంటర్ వారికీ నచ్చినంతగా బీ సి సెంటర్ లకి నచ్చుతుందా అంటే డౌట్ అనే చెప్పాలి .

మొత్తంగా , మజ్ను సినిమా ఫామిలీ ఆడియన్స్ , యూత్ నానీ సినిమాల నుంచి ఏం ఆశిస్తారు అనేది ఖచ్చితంగా అందిస్తుంది. రెండున్నర గంటల పాటు కడుపు నిండా నవ్వుకో గలిగే హాస్యాన్నీ , ప్రేమనీ ఇస్తుంది ఈ చిత్రం. లైటర్ వెర్షన్ లో వెళ్ళిపోవడం వలన ఉత్సాహ పరిచే మూమెంట్ లు లేకపోయినా కనక్ట్ అయితే గనక ఈ సినిమా ప్రేక్షకుడికి ఫుల్లు పసందు చేస్తుంది. అక్కడక్కడా లాజిక్ లు మిస్ అయినా కూడా కామెడీ కవర్ చెయ్యడం తో సక్సెస్ అనే చెప్పాలి. నానీ ఇక మంచి కాంబినేషన్ లు సెట్ చేసుకుంటూ స్టార్ హీరోగా దూసుకుపోవడానికి ఈ చిత్రం దోహదపడుతుంది అనడం లో సందేహమే లేదు. ఫామిలీ తో ఈ వారాంతం తప్పక చూడదగ్గ హిట్టు సినిమా – మజ్ను.

{youtube}v=ez932boLUXw{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -