Friday, April 26, 2024
- Advertisement -

పన్నీర్ పాయసం ఎప్పుడైనా తిన్నారా.. ఒక్కసారి ట్రై చేస్తే?

- Advertisement -

సాధారణంగా మనం సేమియా పాయసం, సగ్గుబియ్యం పాయసం వంటివి తింటూ ఉంటాం. కానీ మీరు ఎప్పుడైనా పన్నీర్ పాయసం తిన్నారా.. తినడానికి ఎంతో రుచికరంగా ఉండే పన్నీర్ పాయసం ఒక్కసారి తిన్నారంటే మరిమరి తినడానికి ఆసక్తి చూపిస్తారు. ఎంతో రుచికరమైన పన్నీర్ పాయసం ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం…

కావలసిన పదార్థాలు:
పన్నీరు 1 కప్పు, చిక్కని పాలు ఒక లీటరు, బియ్యం పిండి టేబుల్ స్పూన్, చక్కెర పొడి అర కప్పు, ఏలకుల పొడి టేబుల్ స్పూన్, బాదం, పిస్తా, ఎండుద్రాక్ష గుప్పెడు, కుంకుమ పువ్వు చిటికెడు.

తయారీ విధానం:
*ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి పాలను బాగా మరిగి వరకు వేడి చేయాలి. అదేవిధంగా పాలను కలియబెడుతూ వేడి చేయాలి.

*మరుగుతున్న ఈ పాలలో కి కుంకుమపువ్వు బియ్యపు పిండి వేసి పది నిమిషాలు చిన్న మంటపై ఉడికించాలి.

Also read:ఆ పత్రికపై విరుచుకుపడ్డ రకుల్ ప్రీత్.. కారణం?

*పది నిమిషాల తర్వాత ఈ పాలలోకి ఏలకులపొడి డ్రైఫ్రూట్స్ వేసి కలియబెట్టి కోవాలి. ఈ విధంగా కొన్ని నిమిషాల పాటు ఈ పాలను బాగా ఉడికించాలి.

*ఐదు నిమిషాల తర్వాత ముందుగా తయారు చేసిపెట్టుకున్న పంచదార మిశ్రమాన్ని వేసి ఉండలు లేకుండా కలిపి పెడుతూ ఉండాలి. ఈ మిశ్రమం బాగా గట్టిపడేవరకు ఉడికించుకోవాలి.

Also read:తన ఆఫీసులోని 200 మందికి వ్యాక్సిన్ వేయించిన దిల్ రాజు?

*ఈ విధంగా పంచదార మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు ఇందులోకి పనీర్ తురుము వేసి మూడు నిమిషాల పాటు కలియబెడుతూ ఉడికించుకుంటే ఎంతో అద్భుతమైన పన్నీర్ పాయసం తయారైనట్లే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -