మార్చి నుంచి సినిమా థియేట‌ర్లు, షూటింగ్‌లు బంద్‌

- Advertisement -
  • షూటింగ్‌లు, థియేట‌ర్ల బంద్ ఎందుకు?
  • టాలీవుడ్‌లో ఇంత‌కు ఏం జ‌రుగుతోంది..
  • డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌పై తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ఆగ్ర‌హం
  • ఏక‌మ‌వుతున్న నిర్మాత‌లు

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఇప్పుడు పెద్ద వివాదం రాజుకుంది. సినిమాలు విడుద‌ల చేస్తున్నా ఎవ‌రికీ గిట్టుబాటు కావ‌డం లేద‌ని ఆందోళ‌న‌లు ఉన్నాయి. సినిమాలు బాగున్నా.. వ‌సూళ్లు రాక‌పోవ‌డం.. సినిమా వ‌చ్చిన నెల‌కే టీవీల‌లో క‌నిపించ‌డం సినీ ప‌రిశ్ర‌మ‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. దీనిపై సినిమా నిర్మాత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ‌కు న‌ష్టాలు భారీగా వ‌స్తున్నాయ‌ని మండిప‌డుతున్నారు. దీనికంత‌టికి డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల (డి.ఎస్‌.పి)తోనే చిక్కొచ్చి ప‌డింది. చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలికి ఇటీవ‌ల తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ నిర్మాత‌లు లేఖ రాశారు. డిజిటల్‌ సర్వీసు ప్రొవైడర్ల (డి.ఎస్‌.పి) గుత్తాధిపత్యం ఉంద‌ని, చలన చిత్ర వాణిజ్య మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మార్చి 1వ తేదీ నుంచి చిత్ర పరిశ్రమ బంద్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ర‌చ్చ‌కు కార‌ణ‌మిదే?
సినిమా పూర్తయిన త‌ర్వాత‌ డిజిటల్‌ సర్వీసు ప్రొవైడర్లు థియేటర్లకు చేరవేస్తారు. వారానికి చొప్పున అద్దె తీసుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో యు.ఎఫ్‌.ఓ, క్యూబ్‌, పి.ఎక్స్‌.డి సంస్థలు డిజిటల్‌ సర్వీసు ప్రొవైడర్లుగా ఉన్నాయి. ఈ సంస్థలు పెత్త‌నం చెలాయిస్తున్నాయి. ఈ సంస్థ‌లు తాము చెప్పిందే రేటుగా మారింది. నిర్మాతలు, పంపిణీదారుల నుంచి అధిక మొత్తం వసూలు చేస్తున్నాయనేది చిత్ర ప‌రిశ్ర‌మ ఆరోపణ. ఇతర రాష్ట్రాల్లో వారానికి రూ.2,500 అద్దె తీసుకుంటుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రూ.10,800 తీసుకుంటున్నారని నిర్మాతలు వాపోతున్నారు. మల్లీప్లెక్స్‌ల‌లో రూ.13 వేలు వసూలు చేస్తున్నారు. ఒక్క షో వేసినా ఏడు రోజులకి డబ్బులు వసూలు చేస్తున్నారని, దీనివల్ల నిర్మాతలు చాలా నష్టపోతున్నారనే వాదన వినిపిస్తోంది. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి డిజిటల్‌ సర్వీసు ప్రొవైడర్లని చర్చలకి పిలిచినా ఆ సంస్థల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో చిత్ర పరిశ్రమ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది.

- Advertisement -

మెంటల్ మదిలో సినిమా బాగున్నాన‌డ‌వ‌క‌పోవ‌డంతో చిత్ర నిర్మాత ద‌గ్గుబాటి సురేశ్‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విలేక‌రుల స‌మావేశం పెట్టి చిత్ర ప‌రిశ్ర‌మ‌లో జ‌రుగుతున్న తీరును వివ‌రించారు. ఈ మధ్య సినిమా విడుద‌లైన నెలకే టీవీలలో వ‌స్తోంద‌ని, జనాలు థియేటర్‌కు రావ‌డం మానేస్తున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ప‌ద్ధ‌తి మారాల‌ని కోరుతూ నిర్మాత‌లు

ఇంకా థియేటర్ పర్సెంటేజ్ పద్ధ‌తిపైన ఎన్నోసార్లు దివంగ‌త దాసరి నారాయణరావు గారు గొంతెత్తారు. ఉదాహరణకు ఒక చిన్న సినిమా రూ.కోటి బడ్జెట్‌తో రూపొందింది కలెక్షన్స్ మాత్రం రూ.4 కోట్లు వస్తే.. రూ.కోటి ప‌న్నురూపంలో పోగా మిగిలిన రూ.3 కోట్లు నిర్మాతకు, ఎక్సిబిట‌ర్‌కు పర్సెంటేజ్ పద్ధతిలో డబ్బులు వచ్చే ప‌రిస్థితి ఉంది.

ఒక మాములు సినిమా తీసుకుందాం. రూ.10 కోట్ల బడ్జెట్ సినిమాకు క‌లెక్ష‌న్స్ రూ.40 కోట్లు వచ్చాయనుకుందాం. దీనిలో రూ.10 కోట్లు ప‌న్నులు పోను మిగిలిన రూ.30 కోట్లలో పర్సెంటేజ్ పద్ధ‌తిలో రూ.18 కోట్లు నిర్మాతకు, రూ.12 కోట్లు ఎక్సిబిటర్‌కు వెళ్తాయి.

రెంటల్ పద్ధతయితే కేవలం రూ.3 కోట్లు చెల్లిస్తే సరిపోతుంది. అంటే రూ.12 కోట్లు కేవలం 3 కోట్లు. ఇదే చిన్న సినిమాలకు వర్తిస్తే వాళ్ళు చాలా నష్టపోతారు. ఇది కేవలం పెద్ద సినిమాలకు మాత్రమే బాగుంటుంది. ఈ పరిస్థితిపై ఇండస్ట్రీ అంతా కలిసిగట్టుగా మాట్లాడుకుని పరిష్కారించుకోవాలని పిలుపునిచ్చారు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -