Tuesday, April 23, 2024
- Advertisement -

సినీ కార్మికుల కోసం భారీ విరాళం ప్రకటించిన నాగార్జున..!

- Advertisement -

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ తో అన్ని వ్యవస్థలతో పాటు సినీ పరిశ్రమ కూడా స్థంభించిపోయింది. దాంతో సినీ పరిశ్రమపై ఆధారపడిన దినసరి కూలీలకు లాక్ డౌన్ నిర్ణయంతో సమస్యలు ఏర్పడ్డాయి.

ఈ నేపథ్యంలో సినీ కార్మికుల కోసం అగ్రహీరో నాగార్జున రూ.1 కోటి విరాళం ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన సందేశం ఇచ్చారు. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే లాక్ డౌన్ తప్పనిసరి.. ఇంట్లోనే ఉండటం ద్వారా ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు. అటు, చిరంజీవి సినీ కార్మికుల కోసం ప్రత్యేక చారిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తమ విజ్ఞప్తి మేరకు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఇప్పటివరకు రూ.3.8 కోట్ల విరాళాలు వచ్చాయని చిరంజీవి వెల్లడించారు.

నాగార్జున రూ.1 కోటి, దగ్గుబాటి ఫ్యామిలీ రూ.1 కోటి, రామ్ చరణ్ రూ.30 లక్షలు, మహేశ్ బాబు రూ.25 లక్షలు, జూనియర్ ఎన్టీఆర్ రూ.25 లక్షలు ఇచ్చారని వివరించారు. అందరికంటే ముందు చిరంజీవి సినీ వర్కర్ల కోసం రూ.1 కోటి విరాళంగా ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -