చిరు బర్త్ డే : రెండు సినిమాల అప్డేట్లు పక్కా..!

ఆగస్టు 22.. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే. ఆ రోజు అభిమానులకు పెద్ద పండుగ రోజు. చిరంజీవి బర్త్ డే వస్తుందంటే చాలు.. రక్తదానం చేస్తుంటారు అభిమానులు. అలాగే ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్ లు వస్తుంటాయని అభిమానులు ఆశిస్తుంటారు. ఈసారి కూడా చిరంజీవి బర్త్ డే సందర్భంగా అభిమానులకు సర్ప్రైజ్ లు ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో చరణ్ నటిస్తుండగా.. ఆయనకు జోడీగా పూజ హెగ్డే నటిస్తోంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు. సెప్టెంబర్లో విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నప్పటికీ పూర్తి క్లారిటీ లేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే ప్రకటించిన సమయానికి ఆ సినిమా రాకపోవచ్చని సోషల్ మీడియాలో ప్రచారం విపరీతంగా జరుగుతోంది. గ్రాఫిక్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ కు మరింత సమయం పట్టే అవకాశం ఉండడంవల్ల ఆర్ఆర్ఆర్ కచ్చితంగా వాయిదా పడుతుందని అంటున్నారు.

ఒకవేళ నిజంగానే ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా పడితే ఆ సినిమాకు ప్రకటించిన తేదీలో ఆచార్య ను విడుదల చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆచార్య విడుదలకు సంబంధించి డేట్ ఫిక్స్ చేస్తారని అంటున్నారు. అలాగే లూసిఫర్ రీమేక్ నుంచి ఓ అప్డేట్ ఖాయమని సమాచారం. లూసిఫర్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు సినిమా టైటిల్ కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అని టైటిల్ పెట్టినట్టు కూడా ప్రచారంలో ఉంది. అయితే అది నిజమో కాదో తెలియాలంటే చిరు బర్త్ డే వరకు వేచి చూడాల్సిందే.

Also Read

చిరు చేసిన తప్పే బన్నీ చేస్తున్నాడా..!

అభిమానుల గుండెల్లో పిడిబాకు.. సినిమాల్లో కొనసాగింపుపై కాజల్ సంచలన ప్రకటన..!

సుకుమార్, మహేష్ మధ్యే మనస్పర్థలు తొలగినట్టేనా..!

Related Articles

Most Populer

Recent Posts