థియేటర్లో ‘వకీల్ సాబ్’.. ఫ్యాన్స్ పూనకాలు..

- Advertisement -

పవన్‌ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత వెండితెరపై మెరవబోతున్న సినిమా `వకీల్‌సాబ్‌` వచ్చేశాడు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన వ‌కీల్ సాబ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2500 స్ర్కీన్ లో రిలీజ్ అయ్యింది.  అర్ధరాత్రి నుంచే థియేటర్ల దగ్గర అభిమానుల సందడి అంతా ఇంతా కాదు. హిందీ `పింక్‌` రీమేక్ గా రూపొందించిన ఈ సినిమా యూఎస్‌, దుబాయ్‌ వంటి దేశాల్లో ఒక్క రోజు ముందే ప్రీమియర్ షోస్‌ పడ్డాయి.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మొదటి నుంచి భారీ అంచనాలు పెంచుతూ వస్తుంది. కథను స్లోగా మొదలుపెట్టి ఇంటర్వెల్ వచ్చేసరికి గ్రిప్పింగ్‌గా ప్రేక్షకులను ఇన్వాల్వ్ చేయడంలో డైరెక్టర్ వేణు సక్సెస్ అయ్యారని అంటున్నారు. పవన్‌, ప్రకాష్‌ రాజ్‌ మధ్య వాదోపవాదాలు పీక్‌లో ఉంటాయని తెలుస్తోంది.

- Advertisement -

పవన్‌ కళ్యాణ్‌ ని తాగుబోతుగా చూపించడం.. ఇంటర్వెల్‌కి ముందు ఓ ఫైట్‌ వస్తుందని, ఆ ఫైట్‌ గూస్‌బంప్స్ తీసుకొస్తుందని అంటున్నారు.  మొదటి భాగం మొత్తం అమ్మాయిలు వేధింపులు ఎదుర్కొనడం, తమ కేసుని వాధించేందుకు పవన్‌ని ఒప్పించే ప్రయత్నం చేయడం మీద సాగుతుందని తెలుస్తోంది. ఇక పవన్‌ కోర్ట్ కి వెళ్లడం సెకండాఫ్‌ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని అభిమానులు వెల్లడిస్తున్నారు.

మొత్తానికి థియేటర్లో పవన్ ని చూస్తున్నంత సేపు ఫ్యాన్స్ చప్పట్లు, విజల్స్ తో మారోమోగిపోయింది. పవన్‌ కళ్యాణ్‌ హీరోగా, శృతి హాసన్‌ ఆయనకు జోడిగా నటించిన ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల, ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు. దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా, వకీల్ సాబ్ కోసం తెల్లవారు జాము నుండి సినిమా ధియేటర్స్ వద్ద పవన్ అభిమానులు సందడి చేస్తున్నారు.

నేటి పంచాంగం, శుక్రవారం (9-4-2021)

ప‌వ‌న్ ‘వ‌కీల్ సాబ్’ గురించి… ఆలియా భట్ ఏమందో తెలుసా?

పవన్ కాదంటే ‘వకీల్ సాబ్’ హీరో అతనే!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -