పవన్ కాదంటే ‘వకీల్ సాబ్’ హీరో అతనే!

- Advertisement -

పవర్‌ స్టార్‌ కి పోటీగా ఏ సినిమా కూడా లేకపోవడంతో అన్నీ థియేటర్లలోనూ వకీల్‌ సాబ్‌ సందడే కనిపిస్తోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ పవన్ కళ్యాన్ హీరోగా సినిమా రూపొందింది. అజ్ఞాతవాసి చిత్రం తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాన్ థియేటర్లో సందడి చేయబోతున్నారు. మూడేళ్ల తర్వాత పవన్‌ కల్యాణ్‌ ని వెండితెరపై చూడబోతున్నామని ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.

మహేష్‌ బాబు AMB థియేటర్లో అయితే 27 షోలన్నీ ముందే బుక్కైపోయాయి.  దీంతో తొలి రోజే కాదు కనీసం వీకెండ్‌ లోనైనా వకీల్‌ సాబ్‌ సినిమా చూద్దామనుకున్న సినీ ప్రేక్షకులకు నిరాశే ఎదురవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి.  ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం వైపున వేణు శ్రీరామ్ ప్రమోషన్ బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి నుంచి కూడా నేను పవన్ కల్యాణ్ అభిమానిని.

- Advertisement -

ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం ‘దిల్’ రాజుగారికి తెలుసు. అందువలన నేను మరింత కేర్ తీసుకుని చేస్తానని ఆయన నాకు ఈ ప్రాజెక్టును అప్పగించారు అని చెప్పాడు. ఒకవేళ పవన్ కళ్యాన్ కాదంటే ఈ కథ అక్కినేని నాగార్జునకు వినిపించేవాడినని.. ఆయన కూడా పాత్రల పరంగా ఎన్నో ప్రయోగాలు చేస్తారని అన్నారు.

నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’కి బ్రేకులేసిన కరోనా

ప్రైవేట్ టీచర్స్ కి వరాలు కురిపించిన సీఎం కేసీఆర్..!

డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే లు ఉన్నారా..? ఇదిగో సమచారం..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -