Saturday, May 4, 2024
- Advertisement -

‘మా’ ఎన్నిక‌ల్లో చిరంజీవి మ‌ద్ద‌తు ఎవ‌రికో..?

- Advertisement -

సార్వ‌త్రిక ఎన్నిక‌లకు మాదిర‌గానే జ‌రుతున్నాయి మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు. గ‌త కొద్ది సంవ‌త్స‌రాలుగా ఎన్నిక‌లు పోటీ త‌ప్ప‌డం లేదు. గతంలో అంద‌రు క‌లిసి ఓ అభ్య‌ర్థిని ఎంపిక చేసేవారు. కాని ఇప్పుడు ఇండ‌స్ట్రీలో గ్రూపులు ఏర్ప‌డ‌టంతో ఎన్నిక‌లు త‌ప్ప‌డం లేదు. ఇక ఈసారి ఎన్నిక‌ల్లో కూడా పోటీ త‌ప్ప‌డం లేదు. మా అధ్య‌క్షుడు కాల‌ప‌రిమితి ఈ నెల 10న ముగియ‌నుండ‌టంతో మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం అయింది. ప్ర‌స్తుతం ‘మా’ అధ్యక్షుడిగా శివాజీరాజా వ్యవహరిస్తున్నారు. ఆయ‌న మ‌రోసారి పోటీకి రెడీ అవుతున్నారు. శివాజీరాజాకు ప్ర‌త్య‌ర్థిగా న‌టుడు న‌రేశ్ పోటీకి దిగుతున్నారు.

గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి ప‌ని చేశారు. ఇప్పుడు ప్ర‌త్య‌ర్థులుగా మారి ఎన్నిక‌ల పోటీ సిద్ధ ప‌డుతున్నారు. న‌రేశ్ సొంత ప్యానెల్‌ను కూడా పెట్టి,ఎన్నిక‌ల మ్యానిఫెస్టోను విడుద‌ల చేశారు. నరేష్ అధ్యక్ష పదవికి, జీవిత రాజశేఖర్‌లు ప్యానల్‌లో కీలక పదవుల కోసం పోటీ చేస్తున్నారు. శివాజీరాజా కూడా త‌న ఎన్నిక‌ల ప్యానల్‌ను రెడీ చేస్తున్నారు. హీరో శ్రీకాంత్‌, న‌టుడు బెన‌ర్జీ,ఉత్తేజ్ వంటి వారు శివాజీరాజాతో ఉన్నార‌ని తెలుస్తోంది. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది కాని మ‌రి మెగాస్టార్ మ‌ద్ద‌తు ఎవ‌రికి ఉందో తెలియాల్సి ఉంది. ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తున్న ఈ రెండు వ‌ర్గాలు కూడా చిరంజీవి మ‌ద్ద‌తు కోసం ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఎవరికి వారు చిరంజీవి మ‌ద్ద‌తు మాకు ఉంటుంద‌ని భావిస్తున్నారు.

మ‌రి చిరంజీవి మ‌నస్సులో ఏముందో తెలియాలి. నిన్న‌( మంగ‌ళ‌వారం) జీవిత రాజ‌శేఖ‌ర్ మీడియాతో మాట్లాడుతు..చిరంజీవి గారిని మేం క‌లిశాం. ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా జ‌ర‌గాలి ఆయ‌న కోరారు. అదేవిధాంగా ఎన్నిక‌లు జ‌రిగిన త‌రువాత అంద‌రు క‌లిసి ప‌ని చేయాలి అని మాతో చెప్పిన‌ట్లుగా జీవిత రాజ‌శేఖ‌ర్ మీడియాకు తెలిపారు. దీనిబ‌ట్టి చిరంజీవి ఎవరికి ఓటు వేస్తారో తెలియ‌ని ప‌రిస్థితి. అయితే ఈ రెండు వ‌ర్గాలు మాత్రం చిరంజీవి మావాడు అనే చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -