‘సైరా’ టీజర్ ప్రోమో లో పవన్ కళ్యాణ్

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. బ్రిటిష్ వారికి విరుద్ధంగా పోరాడిన మొట్ట మొదటి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా పీరియాడిక్ బయోపిక్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా గురించిన ప్రతి అప్డేట్ సినిమాపై అంచనాలను పెంచుతున్న సంగతి తెలిసిందే. రేపు అనగా ఆగస్టు 20న ఈ చిత్రం టీజర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. టీజర్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.

తాజాగా టీజర్ ప్రోమోను ఇవాళ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ టీజర్ ప్రోమో వీడియోలో పవన్ కళ్యాణ్ చిత్ర టీజర్ కు వాయిస్ ఓవర్ ఇస్తూ కనిపించారు. ఈ వీడియో రేపు విడుదల కాబోతున్న టీజర్ పై మరిన్ని అంచనాలను పెంచుతోంది. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అమితాబచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. అమిత్ త్రివేది ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -