- Advertisement -

బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఓంకార్‌

- Advertisement -

రెండు హార్ర‌ర్ సినిమాల‌తో ఆక‌ట్టుకున్న ఓంకార్ ఇప్పుడు మ‌రో సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నాడు. గ‌తంలో మాదిరి కాకుండా కొత్త జోన‌ర్‌లో సినిమా తీసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. బుల్లితెర నుంచి వెండితెర వరకు వచ్చిన యాంకర్.. దర్శకుడు ఓంకార్ రాజు గారి గ‌ది రెండు సినిమాలు తీశాడు. హారర్ కామెడీ ట్రాక్‌తో వచ్చిన ఈ రెండు సినిమాలు బాగానే ఆడాయి. ఇక త‌ర్వాతి సినిమా మాస్ – క్లాస్ తరహాలో ఉండే ఒక క్రీడకు సంబంధించిన కథను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్‌తో తీయాల‌ని ప్లాన్ చేస్తున్నాడంట‌. ఇటీవ‌ల ఓంకార్ శ్రీనివాస్‌కు క‌థ లైన్ వినిపించ‌డంతో తెగ నచ్చేసిందంట‌. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయండి ఆలోపు నా సినిమాలు పూర్తి చేస్తాన‌ని చెప్పాడట. జయ జానకి నాయక సినిమాతో మోస్తారుగా సినిమా ఆడింది. ప్ర‌స్తుతం శ్రీనివాస్ సాక్ష్యం సినిమా పూర్తి చేస్తున్నాడు. ఓంకార్ మాస్ అంశాలతో పాటు కొన్ని కామెడీ సన్నివేశాలు ఉండేలా కథను త‌యారుచేస్తున్నాడట. సినిమా కథ క్రీడా సంబంధిత నేప‌థ్యంలో తీస్తార‌ని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -