తండ్రికి నిర్మాణ బాధ్యతలు అప్పగించిన మెగా హీరో

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై స్వయంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు హీరోగా మరో వైపు నిర్మాతగా తన బాధ్యతలను బాగా నెరవేరుస్తున్నారు రామ్ చరణ్. అయితే తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ కోసం చెర్రీ ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తోందట. అందువల్ల ‘సైరా’ నిర్మాణ బాధ్యతలను తన తండ్రి మెగాస్టార్ చిరంజీవికి అప్పగించారని తెలుస్తోంది. ఎలాగో షూటింగ్ పనులన్నీ పూర్తయ్యాయి పోయాయి కాబట్టి చిరు కూడా దగ్గరుండి పోస్ట్ ప్రొడక్షన్ పనులను దగ్గరుండి చూసుకుంటున్నారట. ప్రస్తుతం చిరంజీవి తన పాత్రకు డబ్బింగ్ చెప్పే పనిలో బిజీగా ఉన్నారు. కేవలం డబ్బింగ్ మాత్రమే కాకుండా ఈ సినిమా నిర్మాణాంతర వ్యవహారాల పైన కూడా చిరు ఒక కన్నేసి ఉంచారట.

ఎప్పటికప్పుడు ప్రొడక్షన్ టీం నుంచి అప్డేట్లను అడిగి తెలుసుకుంటున్నారట. రామ్ చరణ్ ఆర్ఆర్ వచ్చే వారం నుంచి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగులో పాల్గొన బోతున్నారు. ఒక మేజర్ షూటింగ్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ప్రమోషనల్ పనులపై దృష్టి పెట్టనున్నారు. ‘సైరా’ విడుదలయ్యేంత వరకు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ నుంచి చెర్రీ కొన్ని కొన్ని రోజులపాటు బ్రేక్ తీసుకోబోతున్నారు. మరోవైపు అమితాబచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, సుదీప్ కిచ్చా, తమన్నా వంటి స్టార్ కాస్ట్ తో తెరకెక్కనున్న సైరా నరసింహారెడ్డి సినిమా కి సురేందర్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -