సాయి పల్లవి సినిమాలు చేయకపోవడానికి అదే కారణమా ?

ఎలాంటి గ్లామర్, ఎక్స్ పోజింగ్ కు చోటు లేకుండా కేవలం తన నటన, నాట్యంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అతికొద్ది మంది నటీమణుల్లో సాయి పల్లవి ఒకరు. కేవలం కంటెంట్ ఉన్న కథలకే ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. అయితే ప్రస్తుతం ఈ నటి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉండుండటంతో సాయి పల్లవికి పెళ్లి కుదిరిందంటూ ప్రచారం జోరందుకుంది.

పెళ్లి చేసుకోబోతుండటంతోనే సినిమాలకు దూరంగా ఉంటోందన్న వార్తలు వచ్చాయి. దాంతో ఆమె పూర్తిగా మూవీస్ కు దూరం కాబోతోందా అన్న అనుమానాలు సైతం వ్యక్తమయ్యాయి. అయితే దీనిపై సాయి పల్లవి సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు.

లవ్ స్టోరీ, శ్యామ సింగరాయ లాంటి సినిమాల్లో మంచి పాత్రలు చేసిందనీ.. మళ్లీ అదే స్థాయిలో కథలు వచ్చినప్పుడు సినిమాలు చేస్తుందని తెలిపారు. పెళ్లివార్తల్లో నిజంలేదని స్పష్టం చేశారు. దాంతో సాయి పల్లవి త్వరలో ఓ మంచి సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

50 ఏళ్ళ దగ్గర పడుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

హాట్‌ టాపిక్‌గా మారుతున్న సెలబ్రిటీల బ్రేక్‌అప్‌లు

సొంత జెట్ ఫ్లయిట్ ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

Related Articles

Most Populer

Recent Posts