సెట్స్ పైకి శాకుంతలం..!

- Advertisement -

ఓ బేబీ సినిమా తర్వాత సమంత వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తున్నారు. పలు సినిమాల్లో హీరోయిన్ గా ఆఫర్లు వస్తున్నప్పటికీ ఎందువల్లో ఆమె తిరస్కరిస్తున్నారు. ఇటీవల ఆమె కీలక పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ఫ్యామిలీ మెన్ 2 మంచి విజయం సాధించడంతో పాటు, సమంత నటనకు పేరు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ తర్వాత సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శాకుంతలం.రుద్రమదేవి సినిమా తర్వాత గుణ శేఖర్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా మూవీ ఇది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తికాగా కరోనా వల్ల షూటింగ్ నిలిపివేసారు. ప్రస్తుతం అన్ని సినిమాలు మళ్లీ సెట్స్ పైకి వెళ్తున్నాయి.శాకుంతలం సినిమా కూడా చాలా రోజుల తర్వాత మళ్లీ సెట్స్ పైకి వచ్చింది. ఈ సినిమా రెండో షెడ్యూల్ తిరిగి ఇటీవల ప్రారంభించారు. శాకుంతలం షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ వేశారు. అందులోనే సమంత, దేవ్ మోహన్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

- Advertisement -

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను అతి త్వరలోనే విడుదల చేస్తామని గుణశేఖర్ కూతురు నీలిమ గుణ తెలిపింది. దిల్ రాజు సమర్పణలో గుణశేఖర్ టీం వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సమంత శకుంతలగా దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు సమంత తమిళ్ లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో కాతవాకువ రెండు కాదల్ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు.

Also Read

అయ్యో రకుల్ ఏంటీ పరిస్థితి..!

‘ఐకాన్’ తో సుకుమార్ కు భలే చిక్కొచ్చి పడిందే..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -