నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది

- Advertisement -

తెలుగు తెర మీద చెరిగిపోని ముద్ర వేసిన మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ఎవడే సుబ్రమణ్యం సినిమాను తెరకెక్కించిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. ఆ సినిమాకు ‘మహానటి’ అని టైటిల్ పెట్టారట. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన కథ తయారు చేసుకున్నాడట నాగ్ అశ్విన్.

ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్ మొదటి సినిమాతోనే సినిమా అంటే కేవలం ఏంటర్టైన్ మాత్రమే కాదు దానితో ఏదో ఒక మెసేజ్ కూడా ఇవ్వొచ్చు అన్న విషయాన్ని తెలిపాడు. ఇక ఆ సినిమా తర్వాత కొద్ది పాటి గ్యాప్ తీసుకున్న నాగ్ అశ్విన్ సావిత్రి బయోపిక్ ను తీస్తున్నారట. మరి ఈ సినిమాలో మహానటిగా ఎవరు నటిస్తారు అన్నది తెలియాల్సి ఉంది.

- Advertisement -

అంతేకాదు ఈ సినిమాను ఓ పెద్ద బ్యానర్ నిర్మిస్తుందట. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. బయోపిక్ లకు సూపర్ క్రేజ్ ఉన్న ఈ సమయంలో సావిత్రి జీవిత కథను తెర మీదకు తీసుకు రావాలన్న ఆలోచన చేయడం గొప్ప విషయమే అని చెప్పాలి. మరి ఈ సినిమా ఎంతటి ప్రతిష్టాత్మకంగా ఉండబోతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -