- Advertisement -

‘భ‌ర‌త్’ టీంను అభినందించిన ద‌ర్శ‌క ధీరుడు

- Advertisement -

మ‌హేష్ బాబు తాజా చిత్రం ‘భ‌ర‌త్ అను నేను’ సినిమా ఈ రోజే గ్రాండ్‌గా రిలీజ్ అయ్యి సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో యంగ్ సీఎంగా మ‌హేష్ న‌ట‌న‌కు అన్నీ వైపుల నుండి ప్ర‌శంస‌లు అందుతున్నాయి.ఇంత అంద‌మైనా సీఎంను ఇప్ప‌టీ వరుకు చూడ‌లేద‌ని అంత అంటున్నారు.టాలీవుడ్ టాప్ డైర‌క్ట‌ర్ రాజ‌మౌళి ఈ సినిమాపై స్పందించారు. సాధారణంగా సినిమా చూసిన వెంటనే రాజమౌళి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తుంటారు. అలాగే ఆయన ‘భరత్ అనే నేను’ సినిమా చూశారు. “పొలిటికల్ డ్రామాతో కూడిన ఒక కంటెంట్ ను కమర్షియల్ మూవీగా మలచడం గొప్ప విషయం. ఆ పనిని కొరటాల శివ ఎంతో సమర్ధనీయంగా పూర్తి చేశారు.

మహేశ్ బాబు అద్భుతమైన నటనను కనబరిచాడు. సినిమాలో అంద‌రి న‌ట‌న బాగుంద‌ని నటీనటులు బాగా కుదిరారు.ఎక్క‌డ వివాదాల‌కు పోకుండా సినిమా చాలా క్లీన్‌గా ఉంద‌ని రాజ‌మౌళి తెలిపారు.డివివి దాన‌య్య గారు చాలా మంచి సినిమాను నిర్మించారని, టీం సభ్యులంద‌రికి అభినంద‌న‌లు తెలిపారు. దేవీ శ్రీ ప్ర‌సాద్‌ సినిమాకు సంగీతం అందించారు.బాలీవుడ్ భామ కైరా అద్వానీ హీరోయిన్‌గా తెలుగు తెర‌కు ప‌రిచియం అవుతుంది.వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావ‌డంతో మ‌హేష్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -