అంచనాలు భారీగా పెంచేస్తున్న చిత్ర ట్రైలర్

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. మేకింగ్ వీడియోస్ మరియు టీజర్ తోనే సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసిన దర్శక నిర్మాతలు తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, తమన్నా, సుదీప్ వంటి స్టార్ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటిదాకా కేవలం వీళ్ళ ఫస్ట్ లుక్ పోస్టర్ లను మాత్రమే విడుదల చేశారు. తాజాగా విడుదలైన ట్రైలర్ లో సినిమాలో వీళ్ళ పాత్రలు ఎలా ఉండబోతున్నాయో కూడా రివీల్ చేశారు.

“భరత్ మాత కి జై. నరసింహారెడ్డి ఒక సామాన్యుడు కాదు కారణజన్ముడు” అని బ్యాగ్రౌండ్ వాయిస్ తో మొదలయ్యే ట్రైలర్ వీడియో చూస్తే సినిమాలో అద్భుతమైన విజువల్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. కేవలం మూడు నిమిషాల ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతోంది అనడంలో అతిశయోక్తి లేదు. అనుకున్న విధంగానే ఈ సినిమాలోని కొన్ని అద్భుతమైన డైలాగులు కూడా హైలైట్ అవుతున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ ఆఖరిలో చిరు “గెట్ ఔట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్” అనే డైలాగు ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉండి. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు ఈ సినిమా అక్టోబర్ 2 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -