Thursday, May 2, 2024
- Advertisement -

చంద్ర‌బాబుకు షాక్.. జ‌గ‌న్‌కు మద్ద‌తుగా మాట్లాడిని టీడీపీ ఎంపీ

- Advertisement -

ఎన్నిక‌ల వేళ ఏపీ సీఎం చంద్ర‌బాబుకు వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువ‌రు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ మారుతున్న సంగ‌తి తెలిసిందే. కొంద‌రు టీడీపీ ఎంపీలు ఈసారి ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి విముఖ‌త వ్య‌క్తం చేస్తున్నారు. సినీ న‌టుడు ముర‌ళీ మోహ‌న్ మొద‌టి నుంచి టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈయ‌న ఎన్నిక‌ల పోటీ నుంచి త‌ప్పుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈసారి నేను ఎన్నిక‌ల్లో నిల‌బ‌డ‌లేన‌ని చంద్ర‌బాబుకు చెప్పి ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకున్నారు. తాజాగా ఈయ‌న చేసిన కామెంట్స్ ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ముర‌ళీ మోహ‌న జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడి సంచ‌ల‌నం రేపారు. ఇటీవ‌ల తెలుగు ఇండ‌స్ట్రీ నుంచి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ప్ర‌తిప‌క్ష వైసీపీ పార్టీలో చేరుతున్నారు. కింగ్ నాగ‌ర్జున, మాజీ ఎమ్మెల్యే జయ‌సుధ‌,క‌మెడియ‌న్ అలీ, పృథ్వీ, పూరీ జ‌గ‌న్నాథ్ ,తాజాగా న‌టుడు రాజా ర‌వీంద్ర‌, నిర్మాత పీవీపీ వంటి వారు వైసీపీలో చేరారు. ఇలా సినిమా వాళ్లు వైసీపీ చేర‌డంపై ఏపీ సీఎం చంద్ర‌బాబు స్పందించారు. ఆర్థిక నేర‌గాడు అయిన జ‌గ‌న్‌ను సినిమా వాళ్లు క‌ల‌వ‌డం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బ‌ల‌వంత‌గా సినిమా ఇండ‌స్ట్రీ వాళ్ల‌ను వైసీపీలో చేరేలా ఒత్తిడి తెస్తున్నార‌ని చంద్ర‌బాబు మీడియా ఎదుట చెప్పారు. చంద్ర‌బాబు చేసిన కామెంట్స్‌పై తాజాగా టీడీపీ ఎంపీ,న‌టుడు ముర‌ళీ మోహ‌న్ స్పందించారు.

సినిమా వాళ్ల‌ను చుల‌క‌న‌గా చూడవ‌ద్ద‌ని, ఎవ‌రో భ‌య‌పెడితే , భ‌య‌ప‌డిపోయేంత పిరికి వాళ్లు సినిమా ఇండ‌స్ట్రీలో లేర‌ని తెలిపారు. ఇక ఆయ‌న మాట్లాడుతు …ఎవ‌రికి న‌చ్చిన పార్టీలో వారు చేరుతున్నారే త‌ప్ప‌, సినిమా వాళ్ల మీద ఎటువంటి ఒత్తిడి లేద‌ని జ‌గ‌న్‌కు మ‌ద్దతుగా మాట్లాడి చంద్ర‌బాబుకు ఝ‌ల‌క్ ఇచ్చారు. మొద‌టి నుంచి టీడీపీలో ఉన్న మూర‌ళీ మోహ‌న్ ఎందుకు ఇలాంటి వ్యాఖ్య‌లు చేశారో ఎవ‌రికి అర్థం కావ‌డం లేదు. ప్ర‌స్తుతనికి అయితే ముర‌ళీ మోహ‌న్ చేసిన కామెంట్స్ ఇటు రాజ‌కీయ వ‌ర్గాల‌తో పాటు, అటు సినిమా ఇండ‌స్ట్రీలో కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -