కరోనాతో నటుడు, జర్నలిస్ట్ టీఎన్ఆర్ కన్నుమూత!

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనాతో సినీ, రాజకీయ నేతలు కన్నుమూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీ.నరసింహరావు(టీఎన్ఆర్) మరణించారు. గత కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతున్న టీఎన్‌ఆర్‌ నేడు(సోమవారం)తుదిశ్వాస విడిచారు. మొదట హోం ఐసోలేషన్‌లో ఉన్న టీఎన్‌ఆర్‌ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.

‘ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ TNR’ అంటూ సూటిగా, సుత్తి లేకుండా ఇంటర్వ్యూలు చేసే టీఎన్‌ఆర్‌కు యూత్‌లోనూ మంచి క్రేజ్‌ ఉంది. ముక్కుసూటిగా ఆయన సంధించే ప్రశ్నలకు అతిథులు కూడా ఆశ్చర్యపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. టిఎన్ఆర్‌కు అనారోగ్యం అని తెలియగానే ఆయన కోలుకోవాలంటూ పలువురు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.

- Advertisement -

టీఎన్ఆర్ మృతి పట్ల జర్నలిస్టులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా సంతాపాలను ప్రకటిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

కరోనా వైరస్ గాలిలో 6 అడుగుల వరకు వ్యాప్తి.. జర జాగ్రత్త!

తెలంగాణలోని తెల్లరేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

మరోసారి మంచితనం చాటుకున్న అమితాబచ్చన్!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -