Saturday, April 20, 2024
- Advertisement -

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం

- Advertisement -

హాస్య న‌టుడు విజ‌య్ ఆత్మ‌హ‌త్య‌

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ షాక్‌కు గుర‌య్యింది. హాస్య న‌టుడు విజయ్ సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘అమ్మాయిలు అబ్బాయిలు’ సినిమాతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో గుర్తింపు పొందిన విజయ్‌ సాయి కుటుంబ‌క‌ల‌హాల‌తో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌ట్టు తెలుస్తోంది. ‘కరెంట్‌’, ‘వరప్రసాద్‌ పొట్టిప్రసాద్‌’, ‘బొమ్మరిల్లు’, ‘ఒకరికి ఒకరు’ తదితర చిత్రాల్లో విజ‌య్ నటించాడు. ఓ హీరో ద్వారా అమ్మాయిలు – అబ్బాయిలు సినిమాతో తెలుగుతెరకి పరిచయమ‌య్యాడు. ఆదివారం (డిసెంబ‌ర్ 10) రాత్రి హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని తన ఫ్లాట్‌లోఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బొమ్మరిల్లు, ఒకరికి ఒకరు సినిమాలతో మంచి కమెడియన్‌గా, టైమింగ్ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. హీరోల పక్కన కమెడియన్, సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాడు.

అయితే మ‌ళ్లీ సినిమా అవ‌కాశాలు రాక‌, అప్పులు ఎక్కువై ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఎప్పుడూ నవ్విస్తూ, చలాకీగా ఉండే విజయ్ ఆత్మహత్యతో సినీ ఇండస్ట్రీ షాక‌య్యింది. ద‌ర్శ‌కుడు రవిబాబు సినిమాల్లో కామెడీ క్యారెక్టర్లతో ఎక్కువగా ఫేమసయ్యాడు. మా అసోషియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా విజయ్‌కు సన్నిహిత సంబంధం ఉంది.

ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన విజ‌య్‌సాయి అమ్మాయిలు, అబ్బాయిలు, బొమ్మరిల్లు, ఒకరికి ఒకరు, నువ్వేకావాలి, వేచి ఉంటా, చిరుజల్లు, యూత్, వరప్రసాద్, పొట్టి ప్రసాద్, బ్యాక్ పాకెట్, సోగ్గాడు, మంత్ర, ఏకలవ్యుడు, ఇందుమతి, నా గాళ్‌ఫ్రెండ్ బాగా రిచ్ సినిమాల్లో నటించాడు. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య మ‌న‌స్ఫ‌ర్థ‌లు, గొడ‌వ‌లు ఒక కార‌ణంగా చెబుతుండ‌గా, సినీ అవ‌కాశాలు లేక అప్పుల భారం ఎక్కువై ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడ‌ని తెలుస్తోంది. అత‌డి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని నివాళుల‌ర్పిస్తూ ‘ఆద్య మీడియా’ కోరుకుంటోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -