గుండు హనుమంతు రావు పరిస్థితి తెలుసా..?

- Advertisement -

ప్రముఖ కమెడియన్ గుండు హనుమంతురావు పరిస్థితి మరీ దారుణంగా ఉందని తెలిసింది. ఆలీతో జాలిగా ప్రోగ్రామ్ కు సీనియర్ నటి రాగినితో వచ్చిన గుండు.. తన సమస్యలను కరిగిపోయిన ఆస్థుల గురించి కన్నీరుపెట్టుకుంటూ చెప్పాడు. ఆ సమయంలో ఆలీ ఎవరికో ఒకరికి ఫోన్ చేసి సాయం గురించి అడిగేవాడే. కాని అలా చేయకుండా ఎంతో హుందాగా ఎలాంటి సాయం కావాలన్నా తానే చేస్తానని హామి ఇవ్వడంతో కొంతవరకు సమస్య చక్కబడినట్లు కనిపించింది. ఎన్నో ఏళ్లుగా ఆలీ పేదలను ఆదుకుంటూ ఎన్నో సహాయ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాడు.

దానిలో భాగంగానే తన ప్రోగ్రామ్ కు వచ్చిన గుండును తాను ఆదుకుంటానని హామి ఇచ్చడు. పరిశ్రమలో ఎందరో కమెడియన్ల మాదిరిగానే గుండు ఆస్థులు సంపాదించాడు. తన భార్య,కూతురు చనిపోవడంతో ఆస్థులలో కొంత వరకు కరిగిపోయాయి. ఆతరువాత ఉన్నదాంతో కుమారుడిని విదేశాలకు పంపించి అక్కడే చదివించి వాడిని ప్రయెజకుడిని చేయాలనుకునే లోపు కిడ్నీ సమస్య ఇతన్ని వెంటాడడంతో ఉన్న ఆస్థిని అమ్ముకోవల్సి వచ్చింది. ఇక గుండును చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో అతని కుమారుడు విదేశాలనుంచి ఇండియాకు వచ్చేశాడు. దీంతో ఇప్పటి వరకు అతనిపై పెట్టిన ఖర్చు వృధా అయిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -