షియాజీ షిండే గురించి ఎవరికి తెలియని విషయాలు..!

- Advertisement -

దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహించినటు వంటి ఠాగూర్ చిత్రం తెలుగు సినీ ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది. ఈ సినిమాలో విలన్ గా షియాజీ షిండే నటించాడు. ఈ సినిమాతో అతనికి మంచి క్రేజ్ వచ్చింది. తన విలనిజంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న షిండేకి ప్రస్తుతం సినిమా అవకాశాలు ఎక్కువగా రావడం లేదు. ఇతను ఓ మరాఠి నటుడు అయినప్పటికీ.. తాను నటించిన తెలుగు సినిమాల్లో 95శాతం పైగా సినిమాలకు అతనే డబ్బింగ్ చెప్పుకున్నాడు.

‘ఠాగూర్’ తర్వాత ‘వీడే’ ‘గుడుంబా శంకర్’ ‘అతడు’ ‘సూపర్’ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘దేవదాసు'(2006) ‘పోకిరి’ వంటి సినిమాలు ఇతని రేంజ్ ను పెంచాయి. దాంతో ఇతనికి వరస అవకాశాలు వచ్చాయి. మరాఠి, తెలుగుతో పాటు హిందీ,తమిళ్, కన్నడ, మలయాళం,గుజరాతీ, ఇంగ్లీష్ సినిమాల్లో కూడా షియాజీ షిండే నటించాడు. ఇంత మంచి నటుడు వాచ్ మెన్ గా పని చేశాడన్న విషయం చాలా మందికి తెలియదు.

మహారాష్ట్రలో పేద కుటుంబంలో ఫుట్టిన షియాజీ షిండే ఏడో తరగతి వరకు సోంత ఊర్లో చదివుకున్నాడు. ఆ తర్వాత చదువు కోసం పక్క ఊరికి వెళ్లి పదో తరగతి కంప్లీట్ చేశారు. కాలేజీలో ఫీజు కోసం అదే కాలేజీలో మూడేళ్లపాటు వాచ్ మెన్‌గా పనిచేసాడు. పగలు చదువుకుని రాత్రి అదే కాలేజీలో వాచ్ మెన్‌గా పని చేసి వచ్చిన డబ్బులను ఫీజ్ కట్టే వారట. చదువు పూర్తయిన తరువాత ఆర్ధిక సమస్యలు రావడంతో బ్యాంకులో క్లర్క్ కూడా పని చేశారట. ఆ తర్వాత పలు ఉద్యోగాలను వదిలేసుకున్నట్లు చెప్పాడు. అయితే1978, 79 సంవత్సరం టైంలో నాటకాలపై ఆసక్తితో అటువైపు వెళ్ళారు. 1987లో చేసిన ‘జుల్వా’ అనే నాటకం నాకు మంచి పేరు తీసుకొచ్చింది. అక్కడి నుంచి సినిమాలోకి వచ్చి మరాఠీ మూవీతో గుర్తింపు తెచ్చుకున్నారు.

Also Read: గోపీచంద్ గురించి ఎవరికి తెలియని సీక్రెట్స్..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -