Saturday, April 20, 2024
- Advertisement -

లోకేష్ బాబు ముద్ద పప్పు.. అందరూ ఆయనలా కావాలా? : ఎమ్మెల్యే రోజా ఫైర్

- Advertisement -

ఏపిలో కరోనా నేపథ్యంలో పరీక్షలు నిర్వహిస్తుంటే ఊరుకోబోమని.. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ప్రాణాలకు ప్రాధాన్యత ఇస్తూ ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పోరాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రోజా వ్యంగ్యం ప్రదర్శించారు. తిన్నది అరగక చంద్రబాబు, లోకేశ్ విమర్శలు చేస్తున్నారని, ఏం మాట్లాడడానికి విషయాలు లేక, ఇలాంటి అంశాలను లేవనెత్తుతున్నారని మండిపడ్డారు.

లోకేశ్ తనలాగే రాష్ట్రంలోని విద్యార్థులు కూడా చదువులో మొద్దుల్లాగా.. పప్పు సుద్దల్లా మిగిలిపోవాలని కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పరీక్షలు జరుపుతామనో, జరపబోమనో సీఎం జగన్ ఇప్పటికీ కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని, లోకేశ్ ఈ విషయం గుర్తించాలని రోజా హితవు పలికారు. పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులకు బంగారు భవిష్యత్ ఉంటుందని ఆమె గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు ఆరు శాతానికి వచ్చిందని, పూర్తిగా తగ్గిపోయిన తర్వాత పరీక్షలు జరిపితే వారికి నాణ్యమైన విద్యను అందించిన వారమవుతామని రోజా పేర్కొన్నారు.

పరీక్షలు నిర్వహించకుండ పాస్ చేయించుకుంటూ పోతే.. నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు ఇంటర్ చదువే ఎలా సంసిద్దం అవుతారని ప్రశ్నించారు. ఇక ప్రతిపక్ష నేతలు జగన్ పై మెంటల్ మామ అని విమర్శలు చేస్తుండడంపైనా రోజా తనదైన స్టైల్లో స్పందించారు. జగన్ మెంటల్ మామో, చందమామో ప్రజలందరికీ తెలుసని, చందమామ వంటి జగన్ ను విద్యార్థులు ఎంతో ఆప్యాయంగా మామ అంటారని వివరించారు.

నారప్ప విడుదలకు సిద్ధం..!

కంగనాకు పాస్ పోర్ట్ చిక్కులు..!

హ్యాట్సాఫ్​ రాశీ ఖన్నా .. !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -