జుట్టు రాలుతోందా.. అయితే ఈ చిట్కాలను పాటించండి

- Advertisement -

ప్రస్తుత కాలంలో చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. పని ఒత్తిడి, వాతావరణ కాలుష్యం, పోషకాల లోపం వల్ల స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం మార్కెట్ లో లభించే రకరకాల షాంపులను, హెయిర్ ఆయిల్ ను వాడుతున్నారు. దాంతో ఈ సమస్యను మరింత ఎక్కువ చేసుకుంటున్నారు.

అయితే ఈ హెయిర్ ఫాల్ సమస్యకు మరొక కారణం చుండ్రు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే భారీ ఖర్చుతో మార్కెట్లో లభించే రకరకాల ప్రొడక్ట్స్ వాడినా ఎలాంటి ప్రయోజనం లేదని విసిగిన జనాలు కూడా ఉన్నారు. అలాంటి వారు ఒక్క సారి ఇంట్లో లభించే వాటితోనే హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఇందుకోసం ఒక గ్లాసు నీటిని తీసుకుని అందులో ఒక టీ స్పూన్ మెంతులు, టీ స్పూన్ కాఫీ పొడి, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి ఒక ఐదు నిమిషాల పాటు మరిగబెట్టాలి.

- Advertisement -

తర్వాత దాన్ని వడగట్టి ఆ నీటిలో ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె వెయ్యాలి. ఆ మిశ్రమాన్ని మిక్స్ చేసి తలకు పెట్టుకుని ఒక రెండు నిమిషాల మర్దన చేసి.. అరగంట తర్వాత 7తలస్నానం చేస్తే సరి. ఇలా వారానికి రెండు సార్లు ఇలా చేస్తే హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. మీరు కూడా ఒక సారి ట్రై చేసి చక్కటి ఫలితాన్ని పొందండి.

కొండెక్కిన కోడి.. క‌రోనానే కార‌ణ‌మా?

ఇండోనేషియాలో వదర బీభత్సం.. 75 మంది మృతి

కరోనా టెర్రర్.. ఒకే రోజు లక్ష మందికి పాజిటివ్

క్రికె‌ట్ ప్రియుల‌కు గుడ్ న్యూస్‌.. షెడ్యూల్ ‌ ప్రకారమే ఐపీఎల్ !

‘మాస్ట‌ర్’‌ డైరెక్టర్‌తో ప్రభాస్‌ సినిమా !

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -