- Advertisement -
ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం యాత్ర 2. యాత్ర మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంలో వైఎస్ జగన్ పాత్రలో జీవా నటించగా యాత్ర 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. వైఎస్. రాజశేఖర్‌రెడ్డి మరణాంతరం చోటు చేసుకున్న రాజకీయాలు, జగన్ కొత్త పార్టీ పెట్టడం, జగన్ జైలుకు వెళ్లడం, జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం సీఎంగా ఎదిగిన తీరును అద్భుతంగా చూపించారు.
2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో యాత్ర 2 సినిమా రానుంది. ట్రైలర్లో హైలైట్ ఏంటంటే నేను విన్నాను.. నేను ఉన్నాను.. డైలాగ్ . ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి..
