కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణమైన గ్యాంగ్ రేప్ కేసు వెలుగుచూసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు… ఏకంగా 19 మంది యువతులపై సామూహిక అత్యాచారం జరిగినట్టు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. బాధితులను పార్టీలకు ఆహ్వానించి, వారికి తెలియకుండా మత్తు పదార్థాలు ఇచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా నిఖిల్‌ను గుర్తించారు. అతడు తన స్నేహితులతో కలిసి ప్రణాళికాబద్ధంగా ఈ దారుణాలకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది. యువతులను మభ్యపెట్టి వీడియోలు తీసి బెదిరింపులకు కూడా పాల్పడ్డారని అనుమానిస్తున్నారు.
ఇప్పటికే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. మరికొందరు పరారీలో ఉన్నట్లు సమాచారం. బాధితులకు వైద్య సహాయం, కౌన్సెలింగ్ అందిస్తున్నారు. మహిళల భద్రతపై మళ్లీ చర్చ మొదలయ్యింది. ఈ కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
