డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే లు ఉన్నారా..? ఇదిగో సమచారం..!

- Advertisement -

రాష్ట్రంలో గత వారం రోజులుగా చర్చనీయంశంగా మారిన డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యేల పాత్ర నిర్ధారణ చేయలేమని బెంగుళూరు సిటీ లోని గోవిందాపూర్ పోలీసు ఇన్స్పెక్టర్ ప్రకాష్ వెల్లడించారు. కర్ణాటక లో అనేక నేరారోపణలు ఎదుర్కొంటున్న సినీ నిర్మాత శంకర్ గౌడ నేర చరిత్రను పరిశీలిస్తున్న క్రమంలో 2019 జూన్ లో జరిగిన శంకర్ గౌడ కూతురు మొదటి పుట్టినరోజు వేడుకలను సంజయ్ నగర్ లో నిర్వహించారు.

ఆ పార్టీకి అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. అందులో కొంతమంది డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారం వచ్చిన నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఆ కేసు వ్యవహారంలో ఆధారాలు సేకరిస్తున్న సందర్భంలో అప్పట్లో పార్టీకి వచ్చిన కలహర్ రెడ్డి, రతన్ రెడ్డి డ్రగ్స్ సేవించినట్లు పోలీసులకు సమాచారం అందింది. విచారణలో భాగంగా వీరిద్దరికి నోటీసులు జారీ చేశారు.

- Advertisement -

అయితే విచారణకు వారిద్దరు హాజరు కాలేదు. ఈ కేసులో మరో వ్యక్తి నెల్లూరుకు చెందిన వ్యాపారి సందీప్ రెడ్డిని గుర్తించిన పోలీసులు విచారణకు పిలిపించారు. సందీప్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్నట్టు అంగీకరించినా తెలంగాణ ఎమ్మెల్యేల పాత్రపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ కేసులో ఇప్పటి వరకు 13 మందిని విచారించి కేసు నమోదు చేశామని పోలీసులు స్పష్టం చేశారు.

ఇందుకు సంబందించి ఎలాంటి లిఖిత పూర్వక ఫిర్యాదు అందలేదన్నారు. ఇటీవల తెలంగాణలో ఎమ్మెల్యే ల ప్రమేయం ఉన్నట్టు వైరల్ అవుతున్న ప్రచారానికి, కర్ణాటక పోలీసులు చెబుతున్న వాస్తవ వివరాలకు పొంతన లేకపోవడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -