డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు తనీష్ కి నోటీసులు‌!

- Advertisement -

కర్ణాటకలో ఇటీవల కలకలం రేపిన డ్రగ్స్ కేసులో విచారణకు రావాలంటూ టాలీవుడ్ నటుడు తనీష్‌కు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బిగ్‌బాస్ రియాల్టీ షో సీజ‌న్‌-2లో త‌నీష్ పాల్గొన్నారు. ప‌లు సినిమాల్లో కూడా న‌టించిన త‌నీష్ బిగ్‌బాస్ రియాల్టీ షోతో ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందారు. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన తనీష్ గతంలో కూడా డ్రగ్స కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నాడు.

ప్రస్తుతం బెంగళూరులోని బాణా సవ్వడి పోలీసులు ప్రస్తుతం ఒక కేసును విచారిస్తూ ఉన్నారు.ఆ కేసులో భాగంగా సినీ నటుడు తనీష్ తో పాటు మరో ఐదుగురు ఈ రోజు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. 2017లో అప్పట్లో తెలుగు చిత్రపరిశ్రమను ఊపేసిన డ్రగ్స్ కేసులోనూ తనీష్ సిట్ ఎదుట హాజరయ్యాడు. ఒక నైజీరియన్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు వారు ఇచ్చిన సమాచారం మేరకు మస్తాన్, విక్కీ మల్హోత్రా అనే వ్యక్తులు పేర్లు బయటకు వచ్చాయి.

- Advertisement -

మస్తాన్ ను పోలీసులు విచారించగా నిర్మాత శంకర్ గౌడ్ అనే పేరు వెలుగులోకి వచ్చింది. ఇక ఈ నిర్మాత ఆయన ఆఫీస్ లో మందు పార్టీలు ఎక్కువ ఇస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గౌడ తన కార్యాలయంలో ఇచ్చే పార్టీలకు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యేవారని పోలీసులు తెలిపారు.

బుల్లితెరపై దేవిశ్రీ ప్రసాద్ అదుర్స్ !

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుతో కృతిశెట్టి రోమాన్స్ !

జగన్ చేతిలో పోర్టులు.. పట్టాభి బాధ..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -