Saturday, May 4, 2024
- Advertisement -

80 బాణాసంచా ఫ్యాక్టరీలు మూసివేత.. 26 మందికి దారుణం..!

- Advertisement -

తమిళనాడు విరుధునగర్ బాణసంచా కర్మాగారంలో జరిగిన పేలుడులో మరణించిన వారి సంఖ్య 25కు చేరింది. ఫిబ్రవరి 12న ఈ ఘటన జరగ్గా.. అదే రోజు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మృతుల సంఖ్యపై జిల్లా కలెక్టర్ ప్రకటన విడుదల చేశారు. గతంలో శివకాశి లో పరిసర ప్రాంతాల్లో ఎన్నో సార్లు బాణ సంచా కర్మాగారాల్లో ఇలాంటి బ్లాస్టింగ్స్ ఎన్నో జరిగాయి. ఓ వైపు ప్రభుత్వం జాగ్రత్తలు పాటించాని నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినా కొంత మంది యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది కార్మికులు చనిపోతున్నారు.

బాణసంచా తయారు చేయడానికి రసాయనాలు కలుపుతుండగా ఈ పేలుడు సంభవించింది. ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తయారీ నిబంధనలను ఉల్లంఘించినందుకు 80 బాణాసంచా ఫ్యాక్టరీలను మూసేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. కర్మాగారాలు అవకతవకలకు పాల్పడకుండా ఉండేందుకు ఏడు బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.

కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం..!

మళ్ళీ తెర పైకి భైంసా.. ఆ ఎంపీ హౌజ్ అరెస్ట్..!

ఏపిలో ఎమ్మెల్సీలు ఆరుగురు ఏకగ్రీవం.. మండలిలో పెరిగిన వైసీపీ బలం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -