Tuesday, April 23, 2024
- Advertisement -

కూకట్​పల్లి ఏటీఎం కేసు ఛేదించిన పోలీసులు…

- Advertisement -

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఏటీఎం వద్ద ఏప్రిల్‌ 29న జరిగిన నగదు దోపిడీ కలకలం సృష్టించింది. ఈ కేసును సైబరాబాద్‌ పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకొని ఛేదించారు. ఈ ఘటనలో దుండగులు జరిపిన కాల్పుల్లో.. ఏటీఎం సెక్యూరిటీ గార్డు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. చోరీకి పాల్పడినవారు బిహార్‌కు చెందిన అజిత్‌కుమార్‌, ముఖేశ్ కుమార్‌లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసును తాము పూర్తిగా చేధించినట్లుగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రకటించారు. వారిద్దరి నుంచి 6 లక్షల 31 వేల నగదు, ఒక ఆయుధం, 3 మొబైల్స్‌తో పాటు రెండు టూ వీలర్లను స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు.

జీడిమెట్లలో జరిగిన కేసులో కూడా వీరే ప్రధాన నిందితులని, ఆర్థిక ఇబ్బందులతో పాటు మద్యానికి బానిపై ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని వివరించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మమాట్లాడుతూ.. నిందితుల్లో ఒకడు 2018లో దుండిగల్‌లో ఒక మనీ ట్రాన్స్‌ఫర్‌ ఆఫీస్‌కు వెళ్లి అక్కడ పనిచేస్తున్న మహిళను బెదిరించి డబ్బులు దోచుకునే ప్రయత్నం చేయగా.. ఆమె అరవడంతో అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ పోలీసులకు చిక్కాడు… కొన్నాళ్లు జైలులో ఉన్నాడు.

రెండేళ్ల తర్వాత తిరిగి హైదరాబాద్‌ వచ్చిన అతడు గండిమైసమ్మ ప్రాంతంలో ప్యాకేజింగ్‌ పరిశ్రమలో పనిచేస్తూ నేరాల వైపు మళ్లినట్టు వెల్లడించారు. ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చిన అజిత్‌కుమార్‌, స్నేహితుడు ముకేశ్‌ కుమార్‌తో కలిసి గతంలోనూ అనేక నేరాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని సజ్జనార్​ పేర్కొన్నారు. ఏప్రిల్‌ 16న అజిత్‌, ముఖేశ్‌ ఇద్దరూ మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసే ఆఫీస్‌కు వెళ్లి అక్కడ వ్యక్తి వద్ద ఉన్న రూ.1.96 లక్షలు, ఐఫోన్‌ ఎత్తుకొని పారిపోయారు. 24న దుండిగల్‌ వద్ద నిలిపి ఉంచిన బైక్‌ను దోచేశారు. ఆ తర్వాత 220 సీసీ పల్సర్‌ బైక్‌ను దొంగిలించారు. అదే బండిని కూకట్ పల్లి ఏటీఎం చోరీ కోసం ఉపయోగించినట్లు సజ్జనార్ తెలిపారు.

నేటి పంచాంగం,గురువారం (13-05-2021)

తూర్పు గోదావరిలో రోడ్డు ప్రమాదం..

గాంధీ హాస్పిటల్‌లో మహా అద్భుతం.. ఎంటో తెలిస్తే ఔరా అంటారు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -