- Advertisement -

‘క్రైమ్ ఆఫ్ ప్యాషన్’..ఏం చేశాడో తెలుసా!

- Advertisement -

పంజాబ్‌( Punjab)లో సంచలనం రేపిన ‘క్రైమ్ ఆఫ్ ప్యాషన్’ ఘటన వెలుగులోకి వచ్చింది. బఠిండా సమీపంలో సూట్‌కేస్‌లో అర్ధదగ్ధ స్థితిలో 22 ఏళ్ల యువతి మృతదేహం కనుగొనబడిన రెండు రోజుల తర్వాత, జిల్లా పోలీసులు ఆమె స్నేహితుడు ప్రిన్స్ కుమార్‌ను అరెస్టు చేశారు. హత్య అనంతరం నిందితుడు తనతో పాటు ఆ యువతి ఉన్న ఫోటోను తన ఛాతిపై టాటూ వేయించుకున్నట్టు విచారణలో వెల్లడైంది.

పోలీసులు కేసుకు సంబంధించిన సూట్‌కేస్, హత్యకు ఉపయోగించినట్టు అనుమానిస్తున్న కత్తి, అలాగే మృతదేహాన్ని తరలించడానికి వినియోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలు సమీపంలోని మోగా జిల్లాలోని బఘాపురానాకు చెందినది. ఆమె బఠిండాలో నివసిస్తూ ఉండేది. నిందితుడు 35 ఏళ్ల వయస్సు గల నిరుద్యోగి కాగా, మత్తుపదార్థాలకు అలవాటు ఉన్నట్టు సమాచారం.

ఫిబ్రవరి 9వ తేదీ తెల్లవారుజామున సుర్ఖ్‌పీర్ ప్రాంతంలోని తన ఇంట్లోనే ఆమెను కత్తితో పొడిచి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం రెండు రోజుల పాటు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి, దాన్ని కాల్చేందుకు ప్రయత్నించిన తరువాత సూట్‌కేస్‌లో పెట్టి ఫిబ్రవరి 10-11 రాత్రి బఠిండా-ఫాజిల్కా జాతీయ రహదారి సమీపంలోని భేహ్మన్ దివానా గ్రామం వద్ద పొలాల్లో పడేశాడు.

సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఫిబ్రవరి 7న ఇద్దరూ కలిసి కనిపించినట్టు గుర్తించారు. ఫోన్ రికార్డుల సాంకేతిక విశ్లేషణతో 15 మంది అనుమానితులను విచారించి చివరకు ప్రిన్స్‌ను అరెస్టు చేశారు. హత్యకు గల అసలు కారణం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. బాధితురాలి వ్యక్తిగత జీవిత వివరాలను గోప్యంగా ఉంచుతూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -