విజయవాడ గొల్లపూడిలో దారుణం..

- Advertisement -

కొన్ని సార్లు మనం చేసే నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తీసుకు వస్తుందని మరోసారి రుజువైంది. విజయవాడ గొల్లపూడిలో దారుణం చోటు చేసుకుంది. తుపాకీ మిస్‌ఫైర్‌ కావడంతో ఓ హోంగార్డు భార్య చనిపోయారు. సీఎం సెక్యూరిటీ వింగ్ ఏఎస్పీ దగ్గర హోం గార్డ్ వినోద్ కుమార్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అక్కడ నుంచి హోంగార్డు వినోద్‌ తుపాకీని తన నివాసానికి తీసుకొచ్చారు.

ఆ గన్ ని బీరువాలో పెట్టమని భార్యకు చెప్పాడు. బీరువాలో పెడుతున్న సమయంలో తుపాకీ మిస్‌ఫైర్‌ కావడంతో హోంగార్డు భార్య సూర్యరత్న ప్రభ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భవానీపురం పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని హోంగార్డ్‎ను ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

అదితీరావు ‘మహాసముద్రం’ ఫస్టులుక్!

‘ఖిలాడీ’ టీజర్ రిలీజ్.. మాస్ రాజా మళ్లీ హిట్ కొట్టేలా ఉన్నాడే..!

నాగబాబు వర్సెస్ పేర్ని నాని ట్విట్స్ యుద్దం!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -