Tuesday, April 23, 2024
- Advertisement -

కుత్బుల్లాపూర్‌లో పేలుడు.. భయంతో పరుగులు తీసిన జనం

- Advertisement -

ఓ వైపు తెలంగాణలో కరోనా తాకిడికి ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఒకవైపు బ్రతకడానికి సరిపడ ఉపాధి లేకపోవడం, మరో వైపు లాక్‌డౌన్ ఇలాంటి క్లిష్టపరిస్దితుల్లో దిక్కుతోచని స్దితిలో పేదల జీవితాలున్నాయి. మనుషుల నిర్లక్ష్యం వల్ల జరిగే ఊహించని ప్రమాదాలు ఇంకా భీతిగొల్పేలా ఉన్నాయి. ఎప్పుడు ఏ వార్త వినవలసి వస్తుందో అనే టెన్షన్లో జీవించవలసి వస్తుంది. ఇటీవల కడప జిల్లా మామిళ్లపల్లె వద్ద జిలెటిన్ స్టిక్స్ పేలిన ఘటనలో 10 మంది దుర్మరణం పాలవడం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో జరిగిన భారీ పేలుడుతో జనం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. ఓ వ్యక్తి రెండు బ్యాగులు మోసుకుంటూ వచ్చిన జయరాంనగర్ చౌరస్తా వద్ద ఒకదానిని విసిరేశాడు. అది ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. పేలుడు శబ్దం దాదాపు కిలోమీటరు వరకు వినిపించింది.

ఆ పేలుడు ధాటికి పక్కనే ఉన్న పూజాసామగ్రి దుకాణం అద్దాలు బద్దలయ్యాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి చేతిలో ఉన్న మరో బ్యాగును తెరిచేందుకు బాంబ్ స్క్వాడ్‌ను పిలిపించి తెరిచారు. అందులో చెత్త ఉండటంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడిని విచారించగా తనకు ఆ బ్యాగ్ బాలానగర్‌లో దొరికిందని చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పదోతరగతి విద్యార్థులందరు పాస్.. టీ సర్కార్ కీలక నిర్ణయం

ఎన్టీఆర్ కు కరోనా రావడానికి కారణం వాళ్లేనా?

రుయా ఆస్పత్రి మృతులకు రూ. 10లక్షల పరిహారం : సీఎం జగన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -