డబ్బుకు కక్కుర్తి పడ్డాడు.. అంతలోనే కాల్చాడు!

- Advertisement -

ప్రభుత్వ ఉద్యోగులు నిష్పక్షపాతంగ ఉంటూ.. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా వారికి సేవ చేయాలని చెబుతుంటారు. కానీ కొంత మంది తాము ప్రభుత్వ ఉద్యోగులం.. లంచం అడగడం మా హక్కు అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. ఎన్ని సార్లు ఎంత మంది ఉద్యోగస్తులు పట్టుబడ్డా కొంతమంది వక్రబుద్ది మాత్రం మారడం లేదు. తాజాగా ఓ ప్రభుత్వ అధికారి రూ.5 లక్షల లంచం తీసుకొని  ఏసీబీ అధికారులు వస్తున్నారన్న భయంతో వాటిని కాల్చివేశాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో చోటుచేసుకుంది. 

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ తహసీల్దార్ సైదులు గౌడ్ ఓ పని నిమిత్తం ఓ వ్యక్తి నుంచి రూ.6 లక్షలు లంచం డిమాండ్ చేశారు.  బేరాసారాలు ముగిశాక చివరికి రూ.5 లక్షలకు ఫైనల్ అగ్రిమెంట్ కుదిరింది. ఇక తహశీల్దార్ కి మట్టి అంటకుండా జాగ్రత్త పడుతూ.. మాజీ మండల ఉపాధ్యక్షుడు వెంకటయ్య గౌడ్ వ్వాల్సిందిగా  సూచించాడు.

- Advertisement -

ఆయన సూచన మేరకు బాధితుడు రూ.5 లక్షలను వెంకటయ్య గౌడ్‌కు ఇచ్చాడు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. ఏసీబీ అధికారులను చూసి.. చూడంగానే షాక్ తిన్న వెంకటయ్య గౌడ్ రూ.5 లక్షలను తగలబెట్టేశాడు. వెంటనే అధికారులు మంటలను ఆర్పేసి సగం కాలిన నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఏపి సీఎం జగన్ కి కృతజ్ఞతలు : రమణ దీక్షితులు

పాపం శశికళ.. ఎంతపనైంది!!

మళ్లీ పూజలలో కి కేసిఆర్.. హల్దీవాగులోకి కొత్త నీరు..!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -