Friday, March 29, 2024
- Advertisement -

పాపం శశికళ.. ఎంతపనైంది!!

- Advertisement -

తమిళనాడు సహా ఐదు రాష్ట్రాల్లో ఈ ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఓటర్లు సురక్షితంగా ఓటుసేందుకు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసారు.పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉంటే.. మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నెచ్చెలి శశికళకు ఓటు లేకుండా పోయింది.

ఆమె నివసిస్తూ వచ్చిన ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దాంతో ఓటరు జాబితాలో పేరు లేని కారణంగా శశికళ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కోల్పోయారు. మూడు దశాబ్దాలుగా పోయెస్ గార్డెన్ చిరునామాలోనే ఉంటున్న శశికళ థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో ఓటు వేస్తున్నారు. 

అక్రమాస్తుల కేసులో 2017లో జైలుకు వెళ్లిన తర్వాత జయలలిత నివాసాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో అక్కడే నివసిస్తున్న శశికళ, ఇళవరసి సహా 19 మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి అధికారులు తొలగించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తమకు తిరిగి ఓటు హక్కు కల్పించాలని కోరుతూ శశికళ, ఇళవరసి ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ప్రభుత్వానికి ఏకుకి మేకు లా తయారు అయిన హై కోర్టు..!

మళ్లీ పూజలలో కి కేసిఆర్.. హల్దీవాగులోకి కొత్త నీరు..!

క్యూలో నిల్చుని ఓటేసిన తెలంగాణ గవర్నర్ తమిళిసై..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -