Thursday, April 25, 2024
- Advertisement -

ఏపి సీఎం జగన్ కి కృతజ్ఞతలు : రమణ దీక్షితులు

- Advertisement -

ఏపి సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధానార్చకులు ఏవీ రమణ దీక్షితులు కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో రమణదీక్షితులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.  ఈ సందర్భంగా తిరిగి తనను తిరుమల శ్రీవారి ప్రధానార్చకునిగా నియమించినందు కు సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెప్పినట్టు సమాచారం. సీఎం జగన్ ను శాలువాతో సత్కరించిన రమణదీక్షితులు, శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.  ఈ సందర్భంగా రమణ దీక్షితులు మాట్లాడుతూ.. వేల సంవత్సరాల నుంచి వంశ పారంపర్య అర్చకత్వం కొనసాగుతోందని.. ఈ మధ్య దానికి అడ్డంకులు ఏర్పడ్డాయి…సీఎం దీన్ని పునరుద్ధరించారని అన్నారు.

ప్రతి పాలకుడిలో కూడా విష్ణు అంశ ఉంటుంది..దాన్ని సద్వినియోగం చేసుకోవాలని..దానికి వైఎస్ జగన్ సనాతన దర్మానికి ఆటంకం కలిగినప్పుడు విష్ణుమూర్తిలా ధర్మాన్ని పునరుద్ధరించారని అన్నారు. సీఎం వైఎస్ జగన్ మరిన్ని సంవత్సరాలు సీఎంగా ఉండి రాష్ట్రంలోని అర్చకులకు మేలు చేయాలి అన్నారు.

దేవాలయాల్లో నిత్య నైవేద్యాలు, దూపదీపాలు ఆటంకం లేకుండా కొనసాగించాలని సీఎంని కోరామని.. మిరాశీ హక్కుల కోసం చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకులు సౌందర్యరాజన్ కూడా పోరాడారని.. మిరాశీ హక్కు రాజకీయాలకు అతీతమైన వ్యవస్థ రాజులు ఎన్నో భూములు, ఆభరణాలు సమర్పించుకున్నారని.. వాటిని చేసే అర్చకులు ఆకలితో బాధపడకూడదని భూములు సమర్పించుకున్నారు.

అయితే దీన్ని రాజకీయం చేయడం కూడా తగదు అన్నారు. చెట్టుకి పండ్లు ఉన్నపుడు రాతి దెబ్బలు సహజం…టీటీడీపై ఆరోపణలు కూడా అలాంటివే.. ఎవరు రాజకీయాల్లో ఉన్నా విమర్శ చేస్తూనే ఉన్నారని అన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరగదు… వైఎస్సార్ హయాంలో కూడా ఇలానే దుష్ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మాన్ని రక్షించడంలో సీఎం జగన్ విష్ణుమూర్తిలా వ్యవహరిస్తున్నారన్నారు. అర్చకుల కుటుంబాలకు భూములు ఇవ్వాలని కోరామని దీక్షితులు వెల్లడించారు.

పాపం శశికళ.. ఎంతపనైంది!!

ప్రభుత్వానికి ఏకుకి మేకు లా తయారు అయిన హై కోర్టు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -